Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బయటపడ్డ తెలుగు నటి రాసలీలలు ..పెద్ద కథే..!

సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకుని, సినీ గ్లామర్ వెనుక మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ సౌమ్యా శెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె నిర్వాకం ఏకంగా కోటి రూపాయల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులను హనీ ట్రాప్ చేసి, ఫ్లాట్, కారుతో పాటు భారీగా డబ్బు గుంజుకున్నారంటూ సౌమ్యపై విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు అందింది.

తాజాగా, తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు నటి సౌమ్యా శెట్టిపై సంచలన ఆరోపణలు చేశారు. స్నేహం పేరుతో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సౌమ్య శెట్టి తనను రూ. 86 లక్షలు మోసం చేసిందని, ఈ నెల 11న విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు.

wmya Shetty Cheating Case Telangana Man Accuses Actress of 86 Lakh Fraud Visakha CP Orders Probe

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డికి, విశాఖపట్నంలో నివాసం ఉంటున్న సౌమ్యశెట్టికి ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. మార్చి 29న వీరిద్దరూ విశాఖ సమీపంలోని ఓ రిసార్ట్‌లో కలుసుకున్నారు. సాన్నిహిత్యం పెరిగాక, ఆరోగ్యం బాగోలేదని, ఫ్లాట్ కొనుగోలు కోసమని చెప్పి దశలవారీగా డబ్బులు వసూలు చేసింది. మొత్తం రూ. 86 లక్షలు, అలాగే బంగారం కూడా ఇచ్చానని లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

డబ్బు తీసుకున్న తర్వాత కొంతకాలానికి సౌమ్య శెట్టి తనను దూరం పెట్టిందని, తర్వాత లాయర్ ద్వారా ఇకపై కాల్ చేయవద్దని చెప్పించిందని లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మోసంలో సౌమ్యశెట్టి భర్త, తల్లి కూడా సహకరించారని ఆయన సీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు తీవ్రత దృష్ట్యా సీపీ వెంటనే విచారణ చేపట్టాలని భీమిలి సీఐ తిరుమలరావు , పెందుర్తి పోలీసులను ఆదేశించారు.

నిజానికి, సౌమ్యా శెట్టి వివాదాలలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని ఓ యువతి ఇంట్లో బంగారం చోరీ చేసిన కేసులో ఆమె జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది.

మొత్తానికి, ఇన్‌స్టా ఇన్ ఫ్లూయెన్సర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్యా శెట్టి, ఇలాంటి హనీ ట్రాప్ మోసాలకు పాల్పడుతూ, లాయర్ల సహాయంతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపించడం ఆసక్తికరంగా మారింది. ఈ తాజా ఆరోపణలపై నటి సౌమ్యా శెట్టి ఎలా స్పందిస్తారో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+