year ender 2023: గూగుల్ లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్ ఇవే!!
2023వ సంవత్సరం ముగుస్తోంది. 2024 కు త్వరలోనే స్వాగతం పలకబోతున్నాం. దీంతో ఈ సంవత్సరం అంతా ఏం చేశాం.. ఏం చూశాం.. మంచి ఏంటి? చెడు ఏంటి? అన్న చర్చ అంతటా జరుగుతుంది. ముఖ్యంగా సినిమాల విషయంలో అది ఎక్కువగా ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా google ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలలో గూగుల్లో అత్యంత ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ టెన్ మూవీస్ లిస్టును ప్రకటించింది.
సహజంగా సంవత్సరాంతం వస్తుందంటేనే చాలామందికి గూగుల్ లో ఈ సంవత్సరం ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాలు ఏవి? అనేది క్యూరియాసిటీని కలిగిస్తుంది. ఇక నిన్న గూగుల్ లిస్ట్ ను రిలీజ్ చేయడంతో ఏమేం సినిమాలు జనాలు సెర్చ్ చేశారో అందరికీ అర్థం అయిపోయింది. ఈ సంవత్సరం షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

1000 కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమాలను ఈ సంవత్సరం అందించిన షారుక్ ఖాన్ ఈ లిస్టు ను డామినేట్ చేశారు. అయితే ఈ లిస్టులో ఒక్క తెలుగు సినిమా కూడా స్థానం దక్కించుకోకపోవడం గమనించాల్సిన అంశం. షారుక్ ఖాన్ నటించిన జవాన్ తో పాటు, పఠాన్ సినిమాకు కూడా ఈ లిస్టులో స్థానం దక్కింది.


ఇక గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన సినిమాల లిస్టులో పఠాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఇక గూగుల్ ప్రకటించిన టాప్ టెన్ most searched movies in 2023 లో జవాన్ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో గదర్ 2, ఓపెన్ హైమర్ మూడో స్థానంలో, ప్రభాస్ నటించిన ఆది పురుష్ హిందీ నాలుగవ స్థానంలో, పఠాన్ ఐదవ స్థానంలో, ది కేరళ స్టోరీ ఆరవ స్థానంలో నిలిచాయి.

ఇక రజనీకాంత్ నటించిన జైలర్ ఏడవ స్థానంలో నిలువగా, దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది. 9వ స్థానంలో టైగర్ 3 నిలువగా, పదవ స్థానంలో వారిసు ఉంది. ఈ మొత్తం లిస్టులో దక్షిణాది నుండి కేవలం మూడు సినిమాలు మాత్రమే ఉండడం గమనార్హం. ఇక ఆ మూడు సినిమాలు కూడా తమిళ సినిమాలు కావడం గుర్తించవలసిన అంశం.












Click it and Unblock the Notifications