అన్నా.. నువ్వు రీమేక్ సినిమాలు లేకపోతే హిట్ కొట్టలేవా..?

సినీ పరిశ్రమలో రీమేక్ చిత్రాలది ఒక ప్రత్యేక అధ్యాయం. ఒక భాషలో విజయం సాధించిన కథను, అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేసి, తెరకెక్కించడం ఒకప్పటి ట్రెండ్. ఈ రీమేక్ చిత్రాలు ఎందరో స్టార్ హీరోలకు అద్భుత విజయాలను అందించాయి, వారి కెరీర్‌కు మైలురాళ్లుగా నిలిచాయి.అయితే ఓ హీరో ఏకంగా రీమేక్ సినిమాలతోనే కెరీర్‌లో భారీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. తమిళ ఇళయ దళపతి విజయ్.

హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు విజయ్. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా నిలిచాడు. సూపర్ స్టాక్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ కలిగిన హీరోగా విజయ్ నిలిచారు. విజయ్ అంటే తమిళనాడు పడి చచ్చిపోయే వాళ్లు చాలామందే ఉన్నారు. విజయ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు తమిళనాడులో పండుగ వాతావరణం నెలకుంటుంది.

you Can t movies be hits without remakes

అయితే ఆయన కెరీర్‌లో ఎక్కువగా రీమేక్ సినిమాలే హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను విజయ్ తమిళనాట రీమేక్‌లు చేసి హిట్లు కొట్టారు. విజయ్ రీమేక్ సినిమాలు లిస్ట్‌ను ఓ సారి పరిశీలిస్తే..'పెళ్ళి సందడి','బద్రీ,యువకుడు','నువ్వు నాకు నచ్చావ్','ఒక్కడు','అతనొక్కడే','పోకిరి','బాడీగార్డ్','ఆజాద్', '3 ఇడియట్స్' వంటి సినిమాలను విజయ్ తన రీమేక్ చేశారు.

తాజాగా ఆయన మరో తెలుగు సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా మరెదో కాదు.. నట సింహం బాలయ్య నటించిన సూపర్ హిట్ సినిమా 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి' బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాత్రలో నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమాను విజయ్ రీమేక్ చేస్తున్నారు.

'జననాయగన్' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు విజయ్ కూతురి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 'దళపతి కచేరీ' అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం కోలీవుడ్‌ని ఊపేస్తోంది. అయితే విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ చివరి చిత్రంగా 'జననాయగన్' తెరకెక్కుతుంది. ఆయన చివరి చిత్రం ఇలా రీమేక్ కాకుండా స్ట్రెయిట్ సినిమా అయితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+