హిట్ సినిమా అంటే ఇది..!
స్టార్ హీరోలు సైతం హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం హిట్లు హిట్లు కొడుతున్నాడు. అతను మరెవరో కాదు..మౌళి తనుజ్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్‌తో సూపర్ హిట్ కొట్టిన మౌళి తాజాగా "లిటిల్ హార్ట్స్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇటీవల విడుదలైన "లిటిల్ హార్ట్స్" చిత్రం ఈ అంచనాలను తారుమారు చేసి సంచలనం సృష్టించింది.
కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి విమర్శకులను ఆశ్చర్యపరిచింది. మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.

సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు బన్నీ వాస్, వంశీ నందిపాటి ముందుకు వచ్చి సినిమాను భారీగా విడుదల చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.3 కోట్లు కాగా, కేవలం పది రోజుల్లోనే రూ.20.90 కోట్లు నెట్ వసూలు చేసి, లాభాల బాట పట్టింది.
వారం మధ్యలో వర్కింగ్ డే అయినప్పటికీ, "లిటిల్ హార్ట్స్" 11వ రోజున కూడా మంచి వసూళ్లను రాబట్టింది. సోమవారం నాడు రూ.60 లక్షల ఇండియా నెట్, రూ.1.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ మరింత పెరిగాయి.
11వ రోజు వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియాలో రూ.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8 కోట్ల వసూళ్లు ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ దాటి భారీ లాభాలను అందించిన ఈ చిత్రం, ఇప్పుడు టాలీవుడ్‌లో 500% లాభం సాధించిన సినిమాగా నిలిచింది. ఇది చిన్న సినిమాలకు ఒక స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చే విజయం అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications