ఆ సినిమా నుంచి తప్పుకున్న ప్రభాస్?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రస్తుతం కల్కి 2898ఏడీ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సినిమా కోసం డార్లింగ్ పడిన కష్టం, దాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ పనితీరుకు సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లాంటి భారీ తారాగణం సినిమాలో భాగమైంది. పురాణాలకు సైన్స్ ను ముడిపెడుతూ దర్శకుడు చెప్పిన కథా విధానంపై అన్నివర్గాలవారి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పార్ట్2 కోసం ఇప్పటినుంచే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రావడానికి కొంత కాలం పట్టే అవకాశం ఉంది.
పీరియాడిక్ డ్రామాలో నటించాగా
కల్కి తర్వాత మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2తోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హను రాఘవపూడి సినిమా నుంచి ప్రభాస్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కల్కి ద్వారా భారీ హిట్ అందుకోగా మాస్ హీరోగా, పీరియాడిక్ డ్రామాలో నటించిన హీరోగా గుర్తింపు పొందాడు.

ప్రేక్షకులకు నచ్చకపోవచ్చేమో
ఇటువంటి తరుణంలో హను సినిమాలో లవర్ బాయ్ గా చేస్తే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని, అనవసరంగా రిస్క్ చేయడం ఎందుకని దర్శకుడికి ప్రభాస్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అటు హను కానీ, ఇటు డార్లింగ్ కానీ అధికారికంగా చెప్పలేదు. దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే వారిద్దరూ స్పందించాల్సిందే. అలాగే రాజాసాబ్ సినిమాను కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేయాలా? లేదంటే పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలా? అనే సందిగ్ధంలో ప్రభాస్ ఉన్నాడు. చిత్రం పూర్తయిన తర్వాత చివరగా రష్ చూసి ఓ అభిప్రాయానికి రావొచ్చనే ఉద్దేశంలో డార్లింగ్ ఉన్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ ఏం చేస్తాడో చూడాలి మరి.












Click it and Unblock the Notifications