Fact Check : వ్యాక్సిన్ తీసుకుంటే రెండేళ్లలో మరణం... ఆ ప్రచారం పూర్తిగా ఫేక్...

కరోనా వేళ భారత్‌ను అనేక సవాళ్లు వెంటాడుతున్నాయి. ఓవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతుంటే... మరోవైపు వ్యాక్సిన్‌పై లేనిపోని అపోహలు ప్రజల్లో అనవసర భయాందోళన రేకెత్తిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఇటీవల ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి రెండేళ్లలోగా మరణం సంభవిస్తుందనేది దాని సారాంశం. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఇలాంటి ఫేక్ కథనాల ద్వారా ప్రజల్లో అనవసర భయాందోళన నెలకొంటున్నది.

తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ కథనాన్ని తప్పు పట్టింది. ఇది పూర్తిగా ఫేక్ అని తేల్చింది. వ్యాక్సిన్లు సురక్షితమని... వాటిపై లేని అనుమానాలు వద్దని సూచించింది. 'ఫ్రెంచ్ నోబెల్ అవార్డు గ్రహీత ఫోటోతో కోవిడ్ వ్యాక్సిన్లపై సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ అవుతోంది. అందులో పేర్కొన్నది పూర్తిగా ఫేక్. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైనది. కాబట్టి దీన్ని ఫార్వార్డ్ చేయవద్దు.' అని పీఐబీ స్పష్టం చేసింది.

This post claiming death within 2 years of COVID-19 vaccination is fake

ఇప్పటికే మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వ్యాక్సిన్లపై ప్రజల్లో లేని పోని అపోహలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ల ద్వారా విషం ఎక్కిస్తున్నారన్న ప్రచారంతో ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామ ప్రజలు మెడికల్ బృందంపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామ ప్రజలు మెడికల్ బృందం వ్యాక్సిన్లు ఇవ్వడానికి వస్తుందని తెలియగానే... పరిగెత్తుకు వెళ్లి సమీపంలోని సరయూ నదిలో దూకి తప్పించుకున్నారు. వైరస్ కట్టడికి వ్యాక్సినేషనే మార్గమని ప్రభుత్వాలు,ఆరోగ్య సంస్థలు పదేపదే చెబుతున్నప్పటికీ ఇప్పటికీ చాలామందిలో ఆ అవగాహన రావట్లేదు. పైపెచ్చు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న తప్పుడు కథనాలు వారిని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. కాబట్టి ప్రజలు తప్పుడు వార్తా కథనాలను నమ్మవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజ్ఞప్తి చేసింది.

Fact Check

వాదన

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి రెండేళ్లలో మరణం సంభవిస్తుంది.

వాస్తవం

కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+