వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత పుతిన్ మోడీ: పాక్, పశ్చిమ దేశాల్లో దడ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లాంటి సమర్థవంతుడైన నాయకుడు భారతదేశానికి ప్రధాని అవుతారన్న వార్తలతో పొరుగు దేశం పాకిస్థాన్ తోపాటు పాశ్చాత్య దేశాలు వణికిపోతున్నాయి. ఆ దేశాలు ఎప్పుడూ భారతదేశానికి బలహీన, హ్రస్వదృష్టి, తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలే రావాలని కోరుకుంటూ వచ్చాయి. అయితే మోడీ ప్రతీ విషయంలో చాలా ఖచ్ఛితంగా ఉంటారు కాబట్టి పాకిస్థాన్ తోపాటు పాశ్చాత్య దేశాలు ఆయన భారత ప్రధాని అవుతారన్న వార్తతో ఆందోళన చెందుతున్నాయి.

సమర్థుడైన జాతీయ నాయకుడు వ్లాదిమీర్ పుతిన్‌(రష్యా అధ్యక్షుడు)లా నరేంద్ర మోడీ ఎదుగుతున్నారని పాకిస్థాన్ తోపాటు ఇతర పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. ఇది ఆ దేశాలకు జీర్ణించుకోలేనిదిగా మారింది.

Modi Emerges as India’s Putin, Makes both Pakistan and West Nervous

పాశ్చాత్య దేశాల తరపున ఎకనామిస్ట్ వాదన

గత నెలలో ది ఎకానమిస్ట్ ఒక వర్గానికి లాభం చేకూర్చేలా.. మోడీకి వ్యతిరేకంగా ఒక కథనాన్ని ప్రచురితం చేసింది. ‘మోడీని ఎవరైనా ఆపగలరా?' అనే శీర్షికన ప్రచురితమైన ఆ కథనం ఏకపక్షంగా కొనసాగింది. సుప్రీం కోర్టు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఆయనపై దుష్ర్పచారాన్ని చేసింది. భారత దేశంలోని ఎక్కువ మంది ప్రజలు మోడీని ప్రధాని కావాలని కోరుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ది ఎకనామిస్ట్(లండన్ నుంచి ప్రచురితమయ్యే పత్రిక) ఈ కథనంలో నరేంద్ర మోడీపై బురదజల్లేదిగా, బ్రిటీష్ శైలిలో ఉంది. వందల సంవత్సరాలు పాలించిన బ్రిటీష్ వారు మనల్ని బానిసలుగా చూశారు. అవినీతి, కుంభకోణాలు, ద్రవ్యోల్బణం, పరిపాలన లోటు వీటన్నింటిని పక్కన పెట్టిన ది ఎకనామిస్ట్.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మంచి అవకాశం చూపడం వెనక ఆంతర్యమేమిటి?.
గత 65ఏళ్లుగా చేసిన పనే ఎకనామిస్ట్ ఇప్పుడు కూడా చేస్తోంది. బ్రిటీషు వారి నుంచి స్వాతంత్ర్యం పొంది 65ఏళ్లు అయినప్పటికీ వారి ప్రభావాన్ని భారతదేశంపై చూపాలని ప్రయత్నిస్తున్నట్లు ఈ కథనంతో మనకు అర్థమవుతోంది.

పాకిస్థాన్ అసత్య ప్రచారాలు

నరేంద్ర మోడీ భారత ప్రధాని అయితే ప్రాంతీయ ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందని పాకిస్థాన్ అంతర్గత మంత్రి చౌధరి నిస్సార్ అలీఖాన్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల వ్యాప్తికి సహకరిస్తూ.. నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాలు లాంటి సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇప్పుడు ప్రాంతీయ శాంతి గురించి మాట్లాడటం విడ్డూరంగానే ఉంది.

మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవాలన్న నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై స్పందించిన ఈ పాకిస్థాన్ మంత్రి మాట్లాడుతూ.. అలాంటి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతుందని అన్నారు. అంతేగాక దేశాల సరిహద్దుల వెంబడి తాము అనుసరిస్తున్న దోరణి సముచితమేనని చెప్పారు. ఇది ఇలా ఉండగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల భారతదేశంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారిందని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కంట్రీ రిపోర్ట్ వ్యాఖ్యానించింది.

వాస్తవంగా మోడీ మాట్లాడింది ఏమిటి?

నరేంద్ర మోడీ పాకిస్థాన్ ప్రస్తావన లేకుండా దావూద్ ఇబ్రహీంపైనే మాట్లాడారు. అమెరికా సహకరాంతో దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటామని భారత హోంమంత్రి బహిరంగంగా ప్రకటించడాన్ని మోడీ ఖండించారు. కేంద్ర హోంమంత్రికి మచూరిటీ లేనందున ఇలాంటి విషయాలను బహిరంగ పరుస్తున్నారని ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన అమెరికా ముందే తన ప్రణాళికను బహిరంగ పర్చి ఉంటే లాడెన్ వారికి దొరికి ఉండేవారా అని మోడీ ప్రశ్నించారు. అయిదే ఇందులో పాకిస్థాన్ ప్రస్తావన రాకపోయిన ఆ దేశం భుజాలు తడుముకుంది. కాగా, కాశ్మీర్ తమ గొంతుక అని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ అనడం వివాదాస్పదమైంది.

పాకిస్థాన్ సైనికులు భారత సైనికులను హతమార్చితే భారతదేశానికి చెందిన మంత్రులు మన సైనికులపై దాడి చేసింది పాక్ సైనికులు కాదని, వారు ఉగ్రవాదులను పాకిస్థాన్ కంటే ముందే ప్రకటించడం గమనార్హం. ఇలాంటి సహకారం పాకిస్థాన్ దేశానికి భారత ప్రభుత్వం నుంచి లభించింది.

సమర్థుడైన మోడీ.. పాకిస్థాన్‌కు పీడకలే

ఒక్కసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే పరిస్థితులు తమకు పూర్తిగా వ్యతిరేకంగా మారతాయని పాకిస్థాన్ భావిస్తోంది. నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై, సరిహద్దు అంశాలపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉన్నందున పాక్ ఆందోళన చెందుతోంది. వ్లాదిమీర్ పుతిన్ లాంటి మరో సమర్థవంతమైన నాయకుడు వస్తున్నాడని పాక్, పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఆ దేశాలు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సమర్థవంతమైన నాయకులు వచ్చేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా యూరోప్ దేశాలు. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ లాంటి వారిని బ్రిటీష్ ప్రభుత్వం ఇష్టపడదు.

రష్యాలో పుతిన్ చేసిన విధంగా మోడీ చేస్తారా అనే అంశంపై పాశ్చాత్య దేశాల ఉత్కంఠ

వ్లాదిమీర్ పుతిన్ రష్యాలో సుమారు 15ఏళ్ల నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. అతను రష్యా ఆర్థిక పరిస్థితిని, సైన్యాన్ని బలోపేతం చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో రష్యా ఒక శక్తివంతమైన దేశంగా కొనసాగుతోంది. ఇది యూరోపియన్స్, అమెరికన్స్‌కు నచ్చడం లేదు. అదే విధంగా నరేంద్ర మోడీ కూడా భారతదేశాన్ని తీర్చి దిద్దుతాడా అనే అంశంపై పాశ్చాత్య దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆసక్తితోపాటు పాక్ లాంటి దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ఇలా ఉండగా భారతదేశాన్ని ఆర్థిక పరంగా, సైనిక పరంగా బలోపేత దేశంగా చూడాలని కోరుకుంటున్న వారు మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.

- పథికృత్

English summary
So what is the common thing between the left leaning know-all self certified Superior West and Pakistan? Well, both are jittery about the prospect of Narendra Modi becoming the Prime Minister of India since both have always preferred weak, myopic, self serving and pacifist regimes to govern India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X