తెలంగాణ దెబ్బ: విశాఖకు సినిమా 'పరుగు'

Telangana
తెలంగాణ ఉద్యమం దెబ్బకు సినిమాల నిర్మాణానికి విశాఖపట్నం అత్యంత అనువైన ప్రదేశంగా మారుతోంది. తెలంగాణలో ఉద్యమం కారణంగా షూటింగులకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో సినిమాల నిర్మాణానికి ఎక్కువ మంది విశాఖపట్నాన్ని ఎంచుకుంటున్నారు. తెలుగు సినిమాలే కాకుండా బెంగాలీ, ఒరియా, కొన్ని హిందీ సినిమాల షూటింగు కూడా విశాఖపట్నంలో జరుగుతున్నాయి. విశాఖపట్నం, దాని పరిసరాల్లో చక్కటి లోకేషన్లు కూడా ఉన్నాయి. అరకు, బొర్రా గుహలు, 17వ శతాబ్దీ డచ్ టౌన్‌షిప్ భిమిలీ, బీచ్‌లు, పచ్చదనంతో ముసుగేసుకున్న కొండ ప్రాంతాలు, ఎర్ర మట్టి దిబ్బలు సినీ నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో దీనికి వేదికగా మారుతోంది.

ప్రముఖ తెలుగు హీరో బాలకృష్ణ సినిమా షూటింగు కూడా ఇటీవల ఈ ప్రాంతంలో జరిగింది. శభువానిపాలెం రిజర్వ్ ఫారెస్టులో బాలయ్య నటించిన సినిమా షూటింగు జరిగింది. ముగ్గురు సినిమాలోని కొన్ని దృశ్యాలను కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. రామానాయుడు స్టూడియో నిర్మించడంతో చిరంజీవి, మోహన్ బాబు వంటివారు ఇక్కడ స్టూడియోలు నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రతిపాదిత స్టూడియో కోసం భిమిలీ రెవెన్యూ అధికారులు భూమిని కూడా గుర్తించినట్లు సమాచారం.

సాధారణంగా అరకు బీచ్ రోడ్డులో మోటార్ బైక్ చేజింగులను, పాటలను చిత్రించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి చోట్లను కూడా సినిమా షూటింగులకు ఎంచుకుంటున్నారు. ఇట్స్ మై లవ్ స్టోరీ, వీడు తేడా సినిమాలు విశాఖపట్నం అందాలను చూపించాయి. దర్శకుడు తేజ నీకు నాకు డ్యాష్ డ్యాస్ సినిమాను విశాఖ ఏజెన్సీలో నిర్మిస్తున్నారు. మొత్తం మీద, విశాఖపట్నం సినీ పరిశ్రమకు మరో వేదిక కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+