పొగలు చిమ్ముతూ...: ఎయిర్ షో అదుర్స్(ఫోటోలు)
బెంగళూరు: ఈ నెల 6వ తేదిన ప్రారంభమైన వైమానిక ప్రదర్శన(ఎయిర్ షో) ఆదివారం ముగిసింది. బెంగళూరులోని యలహంకలో బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ వైమానిక ప్రదర్శనను ప్రారంభించారు. ప్రారంభం నుండే వీక్షకులు తరలి వచ్చారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో పెద్ద ప్రజలు తరలి వచ్చారు. చివరి రోజైన ఆదివారం నాడు దాదాపు లక్షా యాభై వేల మంది వరకు తిలకించి ఉంటారని చెబుతున్నారు.
ఈ వైమానిక ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన దాదాపు ఆరువందల ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. భారత వాయుసేనకు చెందిన రుద్ర హెలికాప్టర్, రష్యాకు చెందిన రష్యా నైట్స్, సుఖోయ్ యుద్ధ విమానం ఆదివారం ఆకాశంలో చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సుఖోయ్ 27 విమానం గగనతలంలో ప్రదర్శించిన అద్భుత విన్యాసం తమ కళ్లను కట్టి పడేసిందని దానిని తిలకించిన 24 ఏళ్ల టెక్కీ మనోజ్ కుమార్ చెప్పారు.

వైమానిక ప్రదర్శనలో సుఖోయ్ సు-30ఎంకెఐ జెట్ విమానం విన్యాసం

రెడ్ బుల్స్ జిన్ 50ఎల్ఎక్స్ సింగిల్ ఇంజన్, సింగిల్ సీటర్ ప్లేన్

డసల్ట్ రఫెల్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్

రుద్ర హెలికాప్టర్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రోబాటిక్స్ టీమ్ 'సరంగ్' ప్రదర్శన

పార్క్ అయిన ఎయిర్ క్రాఫ్ట్స్‌ను తిలకిస్తున్న వీక్షకులు

తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్

రెడ్ బుల్స్ జిన్ 50ఎక్స్ఎల్ ప్రదర్శన

ఆకట్టుకుంటున్న విన్యాసం

ఢీకొనడం లేదు! ప్రదర్శనలో భాగంగా...

భారత సైనికులు చాపర్ నుండి కిందకు దిగుతూ..
ఆకాశంలో తమ అద్భుత విన్యాసాల ద్వారా ప్రజలను ఉత్సాహపరుస్తున్నామనే భావిస్తున్నామని రష్యన్ నైట్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ అండ్రేయ్ అలెక్సన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఈ వైమానిక ప్రదర్శన ఆసియాలోనే అతి పెద్ద ప్రదర్శన. ఈ అద్భుత ప్రదర్శన పట్ల అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications