వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డ్రాప్ బాక్స్' పుట్టుక వెనుక...

ఓ సర్వర్ లో వ్య్వక్తిగత ఫైళ్ళను స్టోర్ చేసి.. ఇంటర్నెట్ ద్వారా ఎక్కడినుంచైనా వాటిని యాక్సెస్ చేసుకోగలిగే అప్లికేషనే 'డ్రాప్ బాక్స్'.

|
Google Oneindia TeluguNews

ఆక్టన్ సిటీ: ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మందికిపైగా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందిస్తోన్న సంస్థ 'డ్రాప్ బాక్స్'. ఫోటోలు, వీడియోలు, ఇతరత్రా వ్యక్తిగత ఫైళ్ళను ఇందులో స్టోర్ చేసుకుంటే.. ప్రపంచంలో ఎక్కడినుంచైనా వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు.

' డ్రాప్ బాక్స్'లో ఎవరైనా 2 జీబీ వరకు ఉచితంగా స్టోర్ చేసుకునే వీలుంది. ఈ పరిమితి దాటితే మాత్రం రుసుం చెల్లించాల్సిందే. దీనిని వ్యక్తులే కాకుండా 2 లక్షల వరకు వివిధ సంస్థలు కూడా ఉపయోగించుకుంటున్నాయి.

ప్రస్తుతం 10 బిలియన్ డాలర్ల విలువైన 'డ్రాప్ బాక్స్' పుట్టుక కూడా విచిత్రంగానే జరిగింది. దీని వ్యవస్థాపకుడు అమెరికాలోని ఆక్టన్ నగరానికి చెందిన డ్రూ హూస్టన్. ఇతడు మసాచుసెట్స్ సాంకేతిక విశ్వవిద్యాలయం(ఎంఐటి)లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు.

Behind Drop Box Invention

ఒకరోజు బస్సులో కాలేజీకి వెళుతూ అతడు తన ప్యాంటు జేబు తడుముకొని అందులో పెన్ డ్రైవ్ లేదని గమనించాడు. అందులో చాలా ముఖ్యమైన ఫైళ్ళు ఉన్నాయి, పైగా అవి అతడికి అత్యవసరం కూడా.

'ఇప్పుడెలా'.. అంటూ జుట్టుపీక్కున్న డ్రూ హూస్టన్ అలాంటి సమస్య ఇంకెవరికీ రాకూడదని అనుకున్నాడు. అప్పుడే అతడి బుర్రలో ఒక ఆలోచన జీవం పోసుకుంది.

ఓ సర్వర్ లో వ్య్వక్తిగత ఫైళ్ళను స్టోర్ చేసి.. ఇంటర్నెట్ ద్వారా ఎక్కడినుంచైనా వాటిని యాక్సెస్ చేసుకోగలిగేలా ఒక అప్లికేషన్ రూపొందించాడు. అదే 'డ్రాప్ బాక్స్'. ఇలా తన సొంత అవసరం కోసం తయారుచేసుకున్న ఓ అప్లికేషన్ ఈరోజు డ్రూ హూస్టన్ కు కనకవర్షం కురిపిస్తోంది.

English summary
The Invention & Success Story of Drop Box.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X