ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రజలు రుగ్మతలకు గురవుతున్నారు. దీంతో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది. రోగాలు ఒక దాని వెంట మరొకటి దాడి చేస్తుండటంతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

గురువారం నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో వివిధ రకాల సమస్యలతో 1,000 మందికి పైగా ఔట్‌పేషెంట్‌(ఓపీ) విభాగంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫీవర్ ఆసుపత్రికి ప్రతి రోజు 300 నుంచి 500 మంది ఓపీ రోగులు వచ్చేవారు. కానీ ఈ సంఖ్య ఇప్పుడు 1000 మందికి మించిపోయింది.

 ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

సత్తువ లేని, శక్తి సన్నగిల్లిన వారు ఆస్పత్రి వద్ద నీరసించి ఉండిపోతున్నారు. ఇక వృద్ధులైతే నీరసించి చతికిలపడిపోతున్నారు. గురువారం ఏకంగా 1500 మంది ఓపీకి వస్తే అందులో దాదాపు 800 మంది మాత్రమే తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. సమస్య తీవ్రంగా ఉండటంతో 31 మంది రోగులను చేర్చుకొని చికిత్సలు అందిస్తున్నారు.

 ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

ఆసుపత్రికి వచ్చేవారిలో జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు వంటి కేసులే అధికంగా ఉంటున్నాయి. వాతావరణలో మార్పులు కారణంగా ఫీవర్ ఆసుపత్రికి నిత్యం వెయ్యి మందికి మించి అవుట్ పేషంట్లు వస్తున్నారు. దీంతో అనుమానమున్న ప్రతిఒక్కరికీ మలేరియా, డెంగీ, కలరా తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

వారం పది రోజుల క్రితం 400 మంది ఇన్ పేషంట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 980 వరకు చేరింది. ఈ నెల 1న ఓపీ 686 ఉండగా, గురువారం నాటికి అది 980కి చేరింది. ఇక ప్రతి రోజూ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 30లోపు ఉంటే, ఇప్పుడు వరకు ఔట్ పేషంట్‌గా 10,931 మంది చికిత్స పొందడం విశేషం.

ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

ఈ నగరానికి ఏమైంది: ఒకవైపు జ్వరం, మరోవైపు కలరా

సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఫీవర్‌ ఆస్పత్రిలో రెండే కౌంటర్లు ఉండడం వల్ల సరి పోవడం లేదు. రోగుల సంఖ్యకు అనుగుణంగా కౌంట ర్లు లేకపోవడంతో అందరికి చికిత్స అందడం లేదు. ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరగడంతో మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cholera and Dengue Cases Increase In Hyderabad. Patients Huge Throng at Fever Hospital at Nallkunta.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి