హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సగటున ఐదుగురు: ఆఫీసుల్లోనే కుప్పకూలుతున్నారు, ఐటీపై ఈకిన్ సర్వే దిగ్భ్రాంతికర విషయాలు!

నగరంలో ప్రతీ నెలా సగటున ఐదుగురు ఐటీ ఉద్యోగులు గుండెపోటుకు గురవుతున్నట్లు ఈ కిన్ కేర్ సర్వేలో వెల్లడైంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఐటీపై ఈకిన్ సర్వే దిగ్భ్రాంతికర విషయాలు!

హైదరాబాద్: ఐటీ ఉద్యోగంలో ఉన్న మెరుగులన్ని పైపైనే.. లోపలంతా అభద్రతా భావం, తీవ్రమైన ఒత్తిడి ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ అనుకునే ఐటీ రంగంలో ఉద్యోగులు తీవ్ర స్థాయి మానసిక వేదనను అనుభవిస్తున్నారు.

పని ఒత్తిడితో ఆఫీసుల్లోనే కుప్ప కూలుతున్న ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలోని 30ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ కిన్ కేర్ అనే సంస్థ సర్వే నిర్వహించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నిద్రలేమి, హైబీపీ, జీవనశైలి మార్పులు ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు కలిగిస్తున్నట్లు సర్వేలో తేలింది.

 సగటున ఐదుగురు:

సగటున ఐదుగురు:

నగరంలో ప్రతీ నెలా సగటున ఐదుగురు ఐటీ ఉద్యోగులు గుండెపోటుకు గురవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమంలో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. నగరంలోని ఐటీ ఉద్యోగుల్లో హైబీపీతో బాధపడుతున్నవారు 51శాతం మంది ఉన్నట్లు సర్వే ద్వారా తెలిసింది.

ప్రాథమిక చికిత్స అందడం లేదు:

ప్రాథమిక చికిత్స అందడం లేదు:

గుండెపోటుతో కుప్పకూలుతున్న ఉద్యోగులకు సకాలంలో ప్రాథమిక చికిత్స అందించకపోవడం కూడా వారి ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. చాలావరకు ఐటీ కంపెనీల్లో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన వసతులేవి లేనట్లు సర్వే గుర్తించింది. హఠాత్తుగా గుండెపోటు సంభవించే సందర్భాల్లో.. ఐదు నిమిషాల్లోపు ప్రాథమిక చికిత్స అందించకపోతే మెదడులోని కణాలు చచ్చిపోయి ప్రాణపాయం సంభవించే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

 సర్వే చేశారిలా:

సర్వే చేశారిలా:

ఈ కిన్ కేర్ అనే సంస్థ నగరంలోని 25-55ఏళ్ల వయసున్న ఐటీ ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 4500మంది పురుషులు, 1500మంది మహిళల ఆరోగ్య వివరాలను సేకరించింది.

వ్యాయామం చేయకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పు, జీవనశైలిలో మార్పుల వల్ల 51శాతం మంది హైబీపీతో బాధపడుతున్నట్లు గుర్తించింది. 43శాతం మంది సాధారణ రక్తపోటుతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ఐటీ ఉద్యోగుల్లో నమోదవుతున్న గుండెపోటు మరణాల్లో 21శాతం హైబీపీనే కారణమని తేలింది.
సర్వేలో పాల్గొన్నవారిలో 47శాతం మంది వయసు, ఎత్తుకు సంబంధం లేకుండా బరువు పెరిగినట్లు గుర్తించారు.

 డాక్టర్లు ఏమంటున్నారు?:

డాక్టర్లు ఏమంటున్నారు?:

ఆకస్మికంగా గుండెపోటుకు గురైన సందర్భంలో కార్డియోపల్మనరీ యంత్రాలతో స్వల్ప షాక్ లు ఇవ్వాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. చాలా కంపెనీల్లో ఆ వసతులే లేవంటున్నారు. పనిఒత్తిడి, జంక్ ఫుడ్, నిద్రలేమి, హైబీపీ కారణంగా గుండెపోటుతో పాటు పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, కాళ్లు, చేతుల్లోని నరాల్లో రక్త గడ్డకట్టడం వంటి అనారోగ్య సమస్యలను ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

English summary
The survey conducted by eKincare clears that heart attack cases are increased in software employees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X