ప్రకృతి ఆకర్షణల నిలయం.. ఈ కంబాలకొండ(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ఎన్నో ప్రకృతి ఆకర్షణలు కలిగిన కంబాలకొండకు పూర్వ వైభవం రానుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. హుధుద్‌ తుపాను బీభత్సంతో దెబ్బతిన్న కంబాలకొండను ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేస్తామని పర్యావరణ అటవీ విజ్ఞాన సాంకేతిక శాఖ (ఈఎఫ్‌ఎస్‌టీ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ పివి రమేష్‌ స్పష్టం చేశారు.

విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌లో కంబాల కొండను పర్యావరణ పర్యాటక ఉద్యానవనంగా అభివృద్ధి చేసే క్రమంలో నిపుణులు, స్థానికుల అభిప్రాయాల సేకరణకు ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పర్యాటక ప్రియులను ఆకర్షించేలా పచ్చదనంతోపాటు పలు వసతులు కల్పించనున్నట్లు చెప్పారు.

ప్రకృతి రమణీయతకు నిలయం కంబాల కొండ

విశాఖపట్నంకు సమీపంలో ఉన్న కంబాలకొండ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరని చెప్పవచ్చు. అటవీప్రాంతంలో పర్యాటకుల కోసం దాదాపు 80 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రదేశం పర్యాటకులకు సిసలైన ప్రకృతి అనుభూతిని అందిస్తూ వస్తోంది.

కంబాల కొండ

కంబాల కొండ

ఎన్నో ప్రకృతి ఆకర్షణలు కలిగిన కంబాలకొండకు పూర్వ వైభవం రానుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది.

కంబాల కొండ

కంబాల కొండ

విశాఖపట్నంకు సమీపంలో ఉన్న కంబాలకొండ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరని చెప్పవచ్చు.

కంబాల కొండ

కంబాల కొండ

అటవీప్రాంతంలో పర్యాటకుల కోసం దాదాపు 80 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రదేశం పర్యాటకులకు సిసలైన ప్రకృతి అనుభూతిని అందిస్తూ వస్తోంది.

కంబాల కొండ

కంబాల కొండ

గిరిజనులచే నిర్వహించబడుతోన్న ఈ టూరిజం స్పాట్ చక్కని ప్రకృతి ప్రదేశానికి నిలయంగా ఉంటోంది.

కంబాల కొండ

కంబాల కొండ

పర్యాటకులు వివరించేందుకు, తిలకించేందుకు వీలుగా ఈ కంబాలకొండ టూరిజం ప్రదేశంలో ఎన్నో సౌకర్యాలున్నాయి.

కంబాల కొండ

కంబాల కొండ

ఈ టూరిజం ప్రదేశంలో ఉన్న నెమళ్లు, కుందేళ్లు, చిరుతలు, పాల పిట్టలు లాంటివి పర్యటకుల మనసు దోచేసుకుంటాయి. అలాగే ఈ ప్రదేశంలో పర్యాటకులు తనివితీరా ఆనందించడానికి వీలుగా రివర్ క్రాసింగ్, బోటింగ్ సౌకర్యాలతో పాటు ట్రెకింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పర్యాటక ఉద్యానవనంగా కంబాల కొండ

పర్యాటక ఉద్యానవనంగా కంబాల కొండ

హుధుద్‌ తుపాను బీభత్సంతో దెబ్బతిన్న కంబాలకొండను ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేస్తామని పర్యావరణ అటవీ విజ్ఞాన సాంకేతిక శాఖ (ఈఎఫ్‌ఎస్‌టీ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ పివి రమేష్‌ స్పష్టం చేశారు.

 పర్యాటక ఉద్యానవనంగా కంబాల కొండ

పర్యాటక ఉద్యానవనంగా కంబాల కొండ

విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌లో కంబాల కొండను పర్యావరణ పర్యాటక ఉద్యానవనంగా అభివృద్ధి చేసే క్రమంలో నిపుణులు, స్థానికుల అభిప్రాయాల సేకరణకు ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును గురువారం ప్రారంభించారు.

 పర్యాటక ఉద్యానవనంగా కంబాల కొండ

పర్యాటక ఉద్యానవనంగా కంబాల కొండ

ఆయన మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పర్యాటక ప్రియులను ఆకర్షించేలా పచ్చదనంతోపాటు పలు వసతులు కల్పించనున్నట్లు చెప్పారు.

గిరిజనులచే నిర్వహించబడుతోన్న ఈ టూరిజం స్పాట్ చక్కని ప్రకృతి ప్రదేశానికి నిలయంగా ఉంటోంది. పర్యాటకులు వివరించేందుకు, తిలకించేందుకు వీలుగా ఈ కంబాలకొండ టూరిజం ప్రదేశంలో ఎన్నో సౌకర్యాలున్నాయి.

ఈ టూరిజం ప్రదేశంలో ఉన్న నెమళ్లు, కుందేళ్లు, చిరుతలు, పాల పిట్టలు లాంటివి పర్యటకుల మనసు దోచేసుకుంటాయి. అలాగే ఈ ప్రదేశంలో పర్యాటకులు తనివితీరా ఆనందించడానికి వీలుగా రివర్ క్రాసింగ్, బోటింగ్ సౌకర్యాలతో పాటు ట్రెకింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The need for conservation of the eco system of Kambalakonda Wildlife Sanctuary, while taking up redevelopment of Kambalakonda Eco-Tourism Park, was stressed by the speakers at the inaugural of a two-day ‘consultative workshop’ at Novotel hotel here on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X