హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరోల సందడి: జూ.ఎన్టీఆర్ 9999, అఖిల్ 9669

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖైరతాబాద్ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో శనివారం సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్‌లు సందడి చేశారు.

వీరు ఇద్దరు ఒకేసారి తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చారు. వీరిని అధికారులు ఆహ్వానించి రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి 21 లక్షల 38వేలకు కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారుకు ఈ నెల 16న బిడ్డింగులో రూ.10.50 లక్షలకు టీఎస్ 09 ఈఎం 9999 నెంబర్‌ను దక్కించుకున్నారు.

అఖిల్ రూ.1 కోటి 80 లక్షలతో కొనుగోలు చేసిన బెంజ్ కారుకు ఈ నెల 19న జరిగిన వేలంలో టిఎస్ 09 ఈఎల్ 9669 నెంబర్‌ను రూ.41 వేలకు సొంతం చేసుకున్నారు.

 ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

ఖైరతాబాద్ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో శనివారం సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్‌లు సందడి చేశారు. వీరు ఇద్దరు ఒకేసారి తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చారు. వీరిని అధికారులు ఆహ్వానించి రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి 21 లక్షల 38వేలకు కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారుకు ఈ నెల 16న బిడ్డింగులో రూ.10.50 లక్షలకు టీఎస్ 09 ఈఎం 9999 నెంబర్‌ను దక్కించుకున్నారు.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

అఖిల్ రూ.1 కోటి 80 లక్షలతో కొనుగోలు చేసిన బెంజ్ కారుకు ఈ నెల 19న జరిగిన వేలంలో టిఎస్ 09 ఈఎల్ 9669 నెంబర్‌ను రూ.41 వేలకు సొంతం చేసుకున్నారు.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

ప్రముఖ సినీ కథానాయకులు ఎన్టీఆర్‌, అఖిల్‌ అక్కినేని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం నాడు సందడి చేశారు.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

తమ నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఈ ఇద్దరూ ఆర్టీఏ కార్యాలయానికి రావడంతో సందడి వాతావరణం నెలకొంది.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం


ఎన్టీఆర్‌ తన లక్కీ నెంబర్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 9999 కోసం రూ.10.5లక్షలు చెల్లించగా, హీరో అఖిల్‌ తన లక్కీ నెంబర్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 9669కు రూ.41వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. వారు డిజిటల్‌ ప్యాడ్‌పై సంతకం చేశారు.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

ఇటీవల నెంబర్ల వేలంతో ఒక్కరోజే రూ.20.31 లక్షల ఆదాయం వచ్చింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ టిఎస్09 ఈఎం0009 నెంబరును రూ.1.20 లక్షలకు, మనోజ్ బాబు అనే వ్యక్తి టీఎస్09 ఈఎం0007 నెంబరును రూ.1.65 లక్షలు, ఏఎంఆర్ ఇండియా కంపెనీ టీఎస్09 ఈఎం0006ను రూ.1.10 లక్షలు వెచ్చించి వేలంలో కైవసం చేసుకున్నారు.

 ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

గత శనివారం ఒక్కరోజే నెంబర్ల వేలం ద్వారా ఆర్టీఏకు రూ.20.31 లక్షల ఆదాయం సమకూరింది. రవాణా శాఖ.. కొన్ని నెంబర్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని పొందింది. ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో జూనియర్ ఎన్టీఆర్ రికార్డు ధర చెల్లించి 9999 నెంబర్ దక్కించుకున్నారు.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు మాట్లాడుతూ.. ఓ ఫ్యాన్సీ నెంబరుకు ఇంత మొత్తం (జూనియర్ ఎన్టీఆర్ కొన్న ధర) చెల్లించడం ఇది రికార్డ్ అని చెప్పారు.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

ఇప్పటి వరకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరూ ఖర్చు చేయలేదని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరో ఫ్యాన్సీ నెంబర్‌ను ఓ కాంట్రాక్టర్ రూ.6 లక్షలకు దక్కించుకున్నారు.

 ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

జూ ఎన్టీఆర్ దక్కించుకున్న 9999 ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆర్టీఏ అధికారులు రూ.50వేలను ప్రాథమిక ధరగా పెట్టారు. కానీ అది ఏకంగా పదిలక్షలకు పైగా పలికింది.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

గతంలో జూనియర్ ఎన్టీఆర్ రూ.5 లక్షలు చెల్లించి తన లక్జరీ కార్లకు 9999 నెంబర్లను కొన్నారు. '9999' పైన జూనియర్ ఎన్టీఆర్ మక్కువ ఇదే తొలిసారి కాదు. అందుకు గతంలో తన కార్ల కోసం అతను లక్షలాది రూపాయలు వెచ్చించారు.

 ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

గతంలో అదిలాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఓ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారు. జూ ఎన్టీఆర్ హైదరాబాదులో ఉంటుండటంతో అది వివాదమై.. రద్దు చేయబడింది. ఆ తర్వాత హైదరాబాదులో నెంబర్ తీసుకున్నారు.

ఆర్టీఏ కార్యాలయం

ఆర్టీఏ కార్యాలయం

గత శనివారం నాడు రూ.10.5 లక్షలకు దక్కించుకున్న ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎన్టీఆర్ స్వయంగా రాలేదు. అతను జనతా గ్యారేజ్ సినిమా షూటింగులో ఉన్నారు. ఈ శనివారం వచ్చారు.

English summary
Tollywood Heros Jr.NTR, Akhil visit Khairatabad RTA Office on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X