వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచానికి తెలియని 'సీక్రెట్స్': ద.కొరియా-ఉ.కొరియాకు ఇదీ తేడా!, ఎక్కువకాలం బతికేది వాళ్లే..

ద.కొరియాతో పోలిస్తే ఉ.కొరియన్లు ఎత్తు తక్కువ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దక్షిణ కొరియా, సియోల్ లోని సుంగ్ క్యున్‌వాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డానియెల్ ఈ అంశాన్ని అధ్యయనం చేశారు.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్/సియోల్: ప్రపంచమంతా ఉత్తరకొరియా గురించి చర్చ చేస్తున్న సందర్భమిది. ఇన్నాళ్లు మిస్టరీ దేశంగానే మిగిలిపోయిన ఉత్తరకొరియా గురించి ఇప్పుడిప్పుడే కొన్ని కఠిన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

ప్రపంచ దేశాలన్ని ఉత్తరకొరియా యుద్ద తంత్రానికి ఎలా కళ్లెం వేయాలా? అని ఆలోచిస్తుంటే.. ఇలాంటి తరుణంలో అసలు ఉత్తరకొరియా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే మిగతా దేశాల్లో లాగా ఇక్కడి ప్రజలకు అంత స్వేచ్చ, కమ్యూనికేషన్ లేదు కాబట్టి ప్రపంచానికి వారి అభిప్రాయాలు తెలిసే అవకాశం కూడా లేదు.

Recommended Video

Kim Jong Un : 8 Strange And Ridiculous Facts 8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి | Oneindia

తనకు తెలియకుండా దేశంలో చీమ కూడా చిటుక్కుమనొద్దు అనుకునే రకం కిమ్. ఆయన్ను ఎదిరించి బతికి బట్టకట్టడం కూడా అసాధ్యం కాబట్టి ఉత్తరకొరియా ప్రజలు ఒకరకంగా బానిసల్లాగే బతుకీడుస్తున్నారు.

ఉత్తరకొరియాలో వాస్తవ పరిస్థితులకు సంబంధించి అంచనాలే తప్ప కచ్చితమైన ఆధారాలు, లెక్కలు ఎవరి వద్ద లేవు. 21శతాబ్దంలోను ప్రపంచ దేశాలతో కమ్యూనికేషన్ లేకుండా ఉత్తరకొరియా ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారంటే వాళ్ల దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఉ.కొరియా-ద.కొరియా.. 'పాలన':

ఉ.కొరియా-ద.కొరియా.. 'పాలన':

1948లో కిమ్ Il-సంగ్ ఉత్తరకొరియా పగ్గాలు చేపట్టారు. అప్పటినుంచి ఆయన కుటుంబం నియంత్రణలోనే ఉత్తరకొరియా పాలన సాగుతోంది. కిమ్ Il-సంగ్ నుంచి ఆయన కొడుకు కిమ్ జాంగ్-Il, ఆ తర్వాత కిమ్ జాంగ్-ఉన్ అధ్యక్షులు అయ్యారు. అంటే, దాదాపు ఏడు దశాబ్దాలుగా ఆ దేశాన్ని పాలించింది కేవలం ముగ్గురు అధ్యక్షులు మాత్రమే.

మరోవైపు దక్షిణకొరియాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఇప్పటివరకు ఆ దేశానికి 12మంది అధ్యక్షులుగా పనిచేశారు. ఆరుసార్లు గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 1960ల్లో విద్యార్థులు, కార్మికుల ఆధ్వర్యంలో దేశంలో తిరుగుబాటు జరిగింది. దీన్నే ఏప్రిల్ విప్లవం అని కూడా పరిగణిస్తారు.

పది మందిలో ఒకరికే మొబైల్ ఫోన్:

పది మందిలో ఒకరికే మొబైల్ ఫోన్:

ఉత్తరకొరియాలో 30లక్షల మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇక్కడివరకే చెప్పుకుంటే ఈ సంఖ్య పెద్దదిగానే అనిపిస్తుంది. కానీ ఆ దేశ జనాభాతో పోల్చి చూసినప్పుడు అది చాలా తక్కువే అని చెప్పాలి. ఉత్తరకొరియా జనాభా 2.5కోట్లు. అంటే, పదిమందిలో కేవలం ఒకరు మాత్రమే మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్లు లెక్క.

మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నవారిలోను ఎక్కువ మంది రాజధాని ప్యోంగ్ యాంగ్ లో నివసిస్తున్నవారే ఉంటారు. దీన్నిబట్టి అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో అసలు మొబైల్ ఫోన్ అంటే ఏంటో కూడా తెలియనివారు చాలామందే ఉండి ఉంటారనుకోవచ్చు. అదే దక్షిణ కొరియాలో జనాభాను(5.1కోట్లు) మించి మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు.

8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?

ద.కొరియా కంటే పొట్టివాళ్లు:

ద.కొరియా కంటే పొట్టివాళ్లు:

ద.కొరియాతో పోలిస్తే ఉ.కొరియన్లు ఎత్తు తక్కువ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దక్షిణ కొరియా, సియోల్ లోని సుంగ్ క్యున్‌వాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డానియెల్ ఈ అంశాన్ని అధ్యయనం చేశారు. ఉత్తరకొరియా నుంచి దక్షిణకొరియా వలస వచ్చిన కొంతమంది శరణార్థులను పరిశీలించిన ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దక్షిణకొరియన్లకు, ఉత్తరకొరియన్లకు మధ్య సగటున 3-8సెం.మీ ఎత్తు తేడా ఉంటుందని గుర్తించారు. అయితే ఉత్తరకొరియా ప్రజలకు సరైన పౌష్టికాహారం అందుబాటులో లేనందువల్లే వాళ్లు పొట్టిగా ఉంటారన్న వాదన కూడా ఉంది.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

అద్వాన్నమైన రోడ్లు:

అద్వాన్నమైన రోడ్లు:

ఉత్తరకొరియా రాజధాని ప్యోంగ్ యాంగ్ లో విశాలమైన రోడ్లు, ఎక్కడా ట్రాఫిక్ అనేదే కనిపించకుండా ఉంటుంది. కానీ రాజధాని దాటి బయటకు వెళ్తే గానీ అసలు పరిస్థితి అర్థం కాదు. 2006లెక్కల ప్రకారం ఉత్తరకొరియాలో 25,554కి.మీ మేర రోడ్లు ఉన్నాయి. కానీ అందులో కేవలం 3శాతం(724కి.మీ) మేర రోడ్లు మాత్రమే ప్రయాణానికి అనుకూలంగా ఉండటం గమనార్హం.

ఇక ఉత్తరకొరియాలో సొంత వాహనం ఉన్నవారి సంఖ్య కూడా చాలా అంటే చాలా తక్కువ. ప్రతీ వెయ్యి మందిలో ఒకరికే మాత్రమే కారు ఉంది. సొంత వాహనాలు లేని కారణంగా ఇక్కడి బస్ స్టాపుల్లో జనమెప్పుడూ బారులు తీరి కనిపిస్తారు.

బొగ్గు ఎగుమతులే ప్రధానం:

బొగ్గు ఎగుమతులే ప్రధానం:

ఉత్తరకొరియా ఎగుమతుల్లో ప్రధానమైనది బొగ్గు. బొగ్గు నిక్షేపాల పైనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారాపడుతోంది. అయితే ఆ దేశం నుంచి ఎగుమతి అవుతున్న బొగ్గు ఎంతనే దానిపై మాత్రం స్పష్టమైన లెక్కలేవి ఎవరికీ తెలియదు. ఉత్తరకొరియా నుంచి ఎక్కువ శాతం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నది చైనా మాత్రమే. అయితే గత ఫిబ్రవరిలో చైనా దాన్ని నిలిపివేసింది.

ఆర్థిక పరిస్థితి:

ఆర్థిక పరిస్థితి:

నిజానికి 1973వరకు ఉత్తరకొరియా-దక్షిణకొరియాల ఆర్థిక పరిస్థితి ఇంచుమించు దగ్గరగానే ఉండేది. కానీ దక్షిణకొరియాలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకున్న తర్వాత ఆ దేశం రూపు రేఖలు మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పలు పేరెన్నికగన్న ఉత్పత్తులకు ప్రస్తుతం దక్షిణకొరియా ఒక బ్రాండ్ గా ఉంది. అందులో సామ్ సంగ్, హ్యుందాయ్ వంటి గ్లోబల్ కంపెనీలు ఉన్నాయి.

ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థ మాత్రం నానాటికీ తీసికట్టుగానే తయారువుతూ వచ్చింది. 1980లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. పాలనా దక్షత లేని అధ్యక్షులు ఎలాంటి సంస్కరణలు తీసుకురాకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందనేది పరిశీలకుల అభిప్రాయం.

సైన్యం పరంగా టాప్-4:

సైన్యం పరంగా టాప్-4:

జనాభా పరంగా ప్రపంచంలో 52వ పెద్ద దేశమైన ఉత్తరకొరియా.. సైన్యం పరంగా మాత్రం టాప్-4గా ఉండటం గమనార్హం. దేశ జీడీపీలో 25శాతాన్ని ఉత్తరకొరియా తమ సైన్యంపై వెచ్చిస్తోంది.

దక్షిణ కొరియన్ల ఆయుర్దాయం ఎక్కువ:

దక్షిణ కొరియన్ల ఆయుర్దాయం ఎక్కువ:

1990లో వరుసగా సంభవించిన కరువుల తర్వాత ఉత్తరకొరియాలో ప్రజల ఆయుర్దాయం తగ్గిపోయిందని చెబుతారు. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. మిగతా దేశాలతో పోల్చితే ఆ దేశ ప్రజల ఆయుర్దాయం 12ఏళ్లు తక్కువ.

అదే సమయంలో దక్షిణ కొరియన్లు మాత్రం ఎక్కువ కాలం జీవిస్తున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆహారంతో పాటు అక్కడి సౌకర్యవంతమైన జీవనమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఉత్తరకొరియాలో జననాల సంఖ్య ఎక్కువ:

ఉత్తరకొరియాలో జననాల సంఖ్య ఎక్కువ:

2017లో దక్షిణ కొరియాలో శిశువుల జననాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి దశాబ్ద కాలంగా దక్షిణకొరియా ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకోసం భారీగానే ఖర్చు కూడా చేస్తున్నారు. ఇక ఉత్తరకొరియాలో మాత్రం శిశు జననాల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

English summary
The country is often depicted as isolated and thoroughly out of step with the 21st century. Statistics are hard to get and often based on estimates, but what can they tell us about life in the North?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X