వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్దాడింది: నటి దియా మీర్జా రిక్షా తొక్కింది (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పేద ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో పలు దేశాల్లో సేవలందిస్తున్న వాటర్‌హెల్త్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో జలధార ఫౌండేషన్ శంకర్‌పల్లి మండలం జన్వాడలో శుక్రవారం డాక్టర్ వాటర్ పేరుతో వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించింది.

ఈ కార్యక్రమం యావత్తు సందడి చోటు చేసుకుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రాణాధారమైన, సురక్షితమైన తాగునీటి వినియోగంపై, ఆరోగ్యకరమైన పద్ధతులపై అవగాహన కల్పించేందుకు జలధార ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆనందశర్మ అభినందించారు.

దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరుపేదలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సురక్షితమైన తాగునీటికి నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యత లేకపోవడం, పారిశుధ్య లోపంతో చిన్నారులు డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జన్వాడకే పరిమితం కాకుండా, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు డాక్టర్ వాటర్‌ప్లాంట్ ముందుకు రావాలని చేవెళ్ల శాసనసభ్యుడు కెఎస్ రత్నం కోరారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు.

వాటర్ హెల్త్ ఇండియా ఫౌండర్ వికాస్ షా మాట్లాడుతూ - జలధార ఫౌండేషన్ లాభాపేక్ష లేని సంస్థ అని, దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజానీకానికి సురక్షితమైన నీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సురక్షితమైన తాగునీటి వినియోగం, పరిశుభ్రత తదితర సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

రిక్షా తొక్కిన దియా మీర్జా

రిక్షా తొక్కిన దియా మీర్జా

రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో జరిగిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ నటి దియా మీర్జా వాటర్ క్యాన్ల మూడు చక్రాల రిక్షా తొక్కారు.

హారతులు, డప్పుచప్పుళ్లు..

హారతులు, డప్పుచప్పుళ్లు..

జన్వాడలో వాటర్‌ప్లాంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన విదేశీ ప్రతినిధుల బృందానికి, బాలీవుడ్ నటుల బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. గ్రామంలో అడుగుపెట్టగానే బొట్టుపెట్టి, హారతులిచ్చి దండలేశారు.

పూల బొకేలు సమర్పణ

పూల బొకేలు సమర్పణ

సర్పంచ్ వసంతలక్ష్మి ఐలయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి పూలబొకేలు సమర్పించారు. ఊరేగింపుగా వస్తున్న వీరిని స్థానికులు కెమెరాల్లో బంధించారు.

సందడి ఇలా..

సందడి ఇలా..

మన దేశంలోని అమెరికా రాయబారి నాన్సీపావెల్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, గుల్షన్‌గ్రోవర్, దియామీర్జా జనవాడలో సందడి చేశారు.

 పిల్లల ఆనందం ఇలా.

పిల్లల ఆనందం ఇలా.

కరచాలనం చేసేందుకు పిల్లలు పోటీపడ్డారు. ఫొటోలు దిగుతూ యువకులు సందడి చేశారు. పిల్లల ఆనందానికి అవధులు లేవు

ఇలా కూడా...

ఇలా కూడా...

శంకరపల్లి గ్రామ పిల్లలకు ఈ కార్యక్రమం మంచినీటిని అందించడమే కాకుండా వారికి ఆనందాన్ని అందించింది.

అంతా విచిత్రమే..

అంతా విచిత్రమే..

విదేశీ వనితలకు కూడా ఈ కార్యక్రమం విచిత్రమైన అనుభవంగానే మిగిలింది. స్థానికువతో వారు కలిసిపోయారు.

గాజులపై మోజు..

గాజులపై మోజు..

విదేశీ వనితలు భారతీయ సంప్రదాయబద్దమైన చేతి గాజుల పట్ల ఆసక్తి ప్రదర్శించారు. వారికి అవి ఎంతో ముచ్చెట గొలిపాయి.

ఇదేం చిత్రమో..

ఇదేం చిత్రమో..

విదేశీ వనిత ఇదేం చిత్రమో అన్నట్లుగా చూస్తూ ఇలా కనిపించింది. ప్రతిదీ వారికి ఆశ్చర్యంగానే ఉండవచ్చు.

సాయం ఇలా..

సాయం ఇలా..

అమెరికా ప్రతినిధి ఒకరు వృద్ధురాలి కళ్లను చూసి ఏమైందని వివరాలడిగారు. ఆపరేషన్‌కు రెండు వేలు ఖర్చవుతుందని చెప్పడంతో వెంటనే రెండువేలిచ్చి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇలా ముద్దు పెట్టారు..

ఇలా ముద్దు పెట్టారు..

తమకు మంచినీళ్లు అందించడానికి వచ్చిన విదేశీ వనితల పట్ల స్థానిక మహిళలు ప్రేమ కురిపించారు. ఓ మహిళ ఇలా ముద్దు పెడుతూ..

English summary
Water plant launched at Shankarpalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X