Relationship: రిలేషన్‌షిప్‌లో హద్దులు ఉండాలా..? ప్రాముఖ్యత తెలుసుకోండి..
Boundaries in Life: ప్రతి ఒక్కరి జీవీతంలో లిమిట్స్ అనేవి చాలా కీలకం. హద్దులు మీరితే వచ్చే కష్టాలు కోకొల్లలు. నేటి తరంలో చాలా మంది రిలేషన్‌షిప్‌లో మరొకరికి ఎంత స్పేస్ మెయింటెన్ చేయాలో తెలియక చిక్కులు తెచ్చుకుంటున్నారు. అయితే అవి ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం..
రిలేషన్‌షిప్‌లో రహస్యాలు లేదా అబద్ధాలు ఉండకూడదని చాలా మంది నుంచి వినే ఉంటారు. కానీ చాలా మంది వాటిని సరిహద్దులతో గందరగోళానికి గురిచేస్తారు. మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరి జీవితం గురించి మరొకరు తెలుసుకోవటం ఆసక్తిగా ఉండటం సహజం. మీరు డీప్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకోవడం సహజమే అయినప్పటికీ, ప్రేమలో పడటం అనేది మీ వ్యక్తిత్వానికి, పర్సనల్ స్పేస్ పూర్తి-స్టాప్ పెట్టకూడదు. సరిహద్దును నిర్వహించడం ముఖ్యమన్నప్పుడు పరిమితులను సెట్ చేయడం, పర్సనల్ స్పేస్ కలిగి ఉండటం ముఖ్యమని అర్థం. హద్దులను సెట్ చేయడం అంటే మీరు అవతలి వారిని దూరంగా నెట్టివేస్తున్నారని కాదని గుర్తుంచుకోండి. ఇది భద్రత కోసం మాత్రమే. పైగా ఇది అవతలి వ్యక్తికి కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వటంలో సహాయపడుతుంది.

మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు హద్దులను సెట్ చేసుకోవటం బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మీరు ఒకరికొకరు వ్యక్తిగతంగా ఎదగడానికి అవసరమయ్యే స్పేస్, సమయాన్ని అందిస్తుంది. ఇది ఒకరిపై మరొకరికి విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అలాగే సాన్నిహిత్యాన్ని కూడా పెంచుతుంది. హద్దుల్లో ఉన్నప్పుడు మీరు స్వతంత్రంగా ఉన్నట్లు భావిస్తారు. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు భాగస్వామికి కూడా స్పేస్ ఇస్తుంది. ఇది మీ స్వంత అవసరాలు, విలువలను గౌరవించడంలో మీకు సహాయపడుతుంది. పైగా రిలేషన్‌షిప్‌లో అనవసరమైన గొడవలు, గందరగోళానికి తావులేకుండా చేస్తుంది.
మీరు రిలేషన్‌షిప్‌లో హద్దులు ఏర్పాటు చేసుకుంటే.. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఆశయాలు, లక్ష్యాలను సాధించడానికి ఒకరికొకరు సమయంతో పాటు తగిన స్పేస్ ఇవ్వటంలో సహాయపడుతుంది. నేటి సమాజంలో చాలా మంది తమ రిలేషన్‌షిప్‌లను ఈహద్దులు మరచిపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications