వైయస్ కు 'చిరు' నో?

Chiranjeevi
రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డిని బలపరచడానికి సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసుకు మద్దతు ఇవ్వడానికి ఆయన సుముఖంగా ఉన్నప్పటికీ వైయస్ రాజశేఖర రెడ్డిని మాత్రం ముఖ్యమంత్రిగా అంగీకరించబోమని చిరంజీవి చెబుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కు సంబంధించిన కొంత మంది ఇప్పటికే చిరంజీవితో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో చిరంజీవి ఆ విషయం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో దాదాపుగా అసెంబ్లీ ఏర్పడుతోందనే ఇప్పటికీ అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం ఇప్పటికే కాంగ్రెస్ ప్రారంభించినట్లు సమాచారం. డి.శ్రీనివాస్ ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దాని కోసం ఇటు చిరంజీవిని, అటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తెరాస తమ వెనకే ఉంటుందని తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

కాగా, చిరంజీవి వైపు నుంచి మరో ప్రయత్నం కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. తగినన్ని సీట్లు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకోవాలనేది ఆ ప్రయత్నం. హంగ్ వచ్చినా చిరంజీవే ముఖ్యమంత్రి అవుతారని ప్రజారాజ్యం పార్టీ నాయకులు హరిరామ జోగయ్య, కృష్ణంరాజు వేర్వేరు సందర్భాల్లో అన్నారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా యత్నించే అవకాశాలు లేకపోలేదని వారి మాటలను బట్టి తెలుసుకోవచ్చు.

మరో వైపు తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మరో గూటికి వెళ్లకుండా తృతీయ ఫ్రంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోసం తాము ఎవరితోనైనా కలుస్తామని ప్రకటించి కలకలం సృష్టించిన కెసిఆర్ అంతరంగమేమిటో ఎవరికీ తెలియడం లేదు. తెలంగాణకు అనుకూలంగా సిపిఎం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆయన తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించకపోవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సిపిఎంపై ఒత్తిడి తెచ్చేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అందుకే తాజాగా జెడి (ఎస్) నాయకుడు దేవెగౌడ ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తృతీయ ఫ్రంట్ ఎజెండాలో ఉందని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చిరంజీవిపైనా, కెసిఆర్ పైనా ఆధారపడి ఉన్నట్లు పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+