• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ ఏమిటి?

By Pratap
|

Telangana Talli
తెలంగాణపై ఈ నెల 5వ తేదీన కేంద్ర హోం శాఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులు తమ ప్రాంతం గురించి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరం గురించి చేస్తున్న వాదనను ఇక్కడ ఇస్తున్నాం. సమైక్యవాదుల అభిప్రాయాన్ని కూడా ఇదే రీతిలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.

తెలంగాణ

తెలంగాణ ప్రాంతం 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. అంతకు ముందు ఈ ప్రాంతాన్ని ఏడో ఆసఫ్ జాహీ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ పాలించాడు. అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందాడు. 1937 ఫిబ్రవరి 22వ తేదీ టైమ్ మ్యాగజీన్ కవర్ పేజీని అతను అలంకరించాడు.

స్వాతంత్ర్యానినికి పూర్వం భారతదేశంలో ఉన్న 562 స్వతంత్ర రాజ్యాల్లో హైదరాబాద్ రాజ్యం అతి పెద్దది. దీని వైశాల్యం 86 వేల చదరపు మైళ్లు. ఇది దాదాపు యునైటెడ్ కింగ్ డమ్ అంత పెద్దది. ఏడో నిజాం బ్రిటిష్ పాలనలో అత్యున్నత స్థాయి రాజుగా గుర్తింపు పొందాడు. అతను 21 - గన్ సాల్యూట్ కు అర్హుడు. బ్రిటిష్ సామ్రాజ్యానికి విశ్వాసపాత్రుడైన మిత్రుడిగా స్థానం సంపాదించుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అందించిన ఆర్థిక సాయానికి గాను అతనికి ఆ గుర్తింపు లభించింది.

అదే సమయంలో ప్రజలకు మేలు చేసే పాలకుడిగా కూడా అతను పేరు సంపాదించుకున్నారు. విద్య, శాస్త్రం, అభివృద్ధి, సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, సంస్కృతి, ఆభరణాల సేకరణ, షడ్రషోపేతమైన ఆహారం వంటివాటిలో కృషికి ఏడో నిజాం పేరిన్నిక గన్నాడు. తన 37 పాలనలో నిజాం విద్యుత్తు సరఫరాకు శ్రీకారం చుట్టాడు. రైల్వేలు, రోడ్లు, ఎయిర్ వేస్ ను అభివృద్ధి చేశాడు. హైదరాబాదులోనూ దాని పరిసరాల్లోనూ పలు సరస్సులు తవ్వించాడు. తుంగభద్ర నదిపై నీటి పారుదల ప్రాజెక్టులను కూడా చేపట్టాడు. నిజాం నిర్మించిన భవనాల్లోనే ఇప్పటికీ పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు నడుస్తుండడం గమనార్హం. ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు భవంతులు మనకు తెలిసినవే. ఇప్పటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అప్పటి ఆసఫియా లైబ్రరీ. అప్పటి టౌన్ హాల్ ఇప్పటి అసెంబ్లీ హాల్, జూబిలీ హాల్. అప్పటి హైదరాబాద్ మ్యూజియం ఇప్పటి నిజామియా అబ్జర్వేటరీ. అలా పలు భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగపడుతున్నాయి.

నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ను స్థాపించాడు. అదే ఇప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. అది హైదరాబాద్ రాజ్యం ఉస్మానియా సిక్కాలను చెలామణిలో ఉంచేది. అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో సొంత కరెన్సీ ఉన్న రాజ్యం హైదరాబాద్ ఒక్కటే. దాన్ని హైదరాబాద్ రూపీగా పిలిచేవారు. అది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు భిన్నమైంది. సొంత కరెన్సీని చెలామణిలో పెట్టుకోవడానికి బ్రిటిష్ పాలకుల అనుమతి ఉన్న రాజ్యం కూడా హైదరాబాద్ ఒక్కటే. వంద రూపాయల నోటును 1918లో ప్రవేశపెట్టారు.

తెలంగాణలోని చేతివృత్తులవారిని నిజాం ఇతోధికంగా ప్రోత్సహించాడు. తెలంగాణ చేనేత కార్మికుడు చీరను నేసి ప్రపంచంలోనే రికార్డు సృష్టించాడు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను అతను నేశాడు. అది ఆరు మీటర్లు ఉండి ఒక స్త్రీ ధరించడానికి వీలైంది కూడా.

1947కు ముందు హైదరాబాద్ భారతదేశంలో ఐదో అతి పెద్ద నగరం. అద్భుతమైన పరిపాలనా భవనాలు, రోడ్లు, రైల్వే వ్యవస్థ, విమానాశ్రయాలు, పోలీసు, సైనిక వ్యవస్థలతో పాటు ఇతర మౌలిక సదపాయాలు కూడా హైదరాబాదులోని అభివృద్ధి చెందాయి. అనుబంధం 1లో నైజాం కాలంలో జరిగిన అభివృద్ధిని చూడవచ్చు.

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది, హైదరాబాదుకు రాలేదు

1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది. మత ప్రాతిపదికపై దేశం విభజనకు గురైంది. భారత ఉపఖండం నుంచి బ్రిటిష్ పాలకులు 1947లో ఖాళీ చేసిన తర్వాత కూడా నిజాం పాలనలో 16 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు బ్రిటిష్ కామన్ వెల్త్ దేశాల్లో ప్రత్యేకంగా దేశంగా కొనసాగే ఉద్దేశంతో నిజాం భారత్ లో గానీ పాకిస్తాన్ లో గానీ కలవడానికి ఇష్టపడలేదు. అయితే ఆ ప్రతిపాదనను బ్రిటిష్ పాలకులు తిరస్కరించారు. భారత్ తో అవగాహనకు రావడానికి తిరస్కరించేందుకు నిజాం రజాకార్లను చూపిస్తూ వచ్చాడు.

నిజాంపై వేలాది మంది రైతులు తిరుగుబాటు చేశారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంతో సిపిఐ చేతులు కలిపింది. వేలాది మంది ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు 1948 తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా స్థానిక భూస్వాముల భూములు చాలా వరకు పేదల చేతుల్లోకి వచ్చాయి. భారత చరిత్రలోనే ఇది మహా పోరాటంగా గుర్తింపు పొందింది. నిజాం సాయుధ పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నించాడు. జలియన్ వాలా బాగ్ తలపించే మారణకాండ తెలంగాణలోని బైరాన్ పల్లి, కుటిగల్, ఆకునూరు, మాచిరెడ్డిపల్లి, రేణిగుంట, గుండ్రాంపల్లి, పెరుమల్ల గ్రామాల్లో సాగింది.

మహాత్మా గాంధీ ఇలా అన్నారు - హైదరాబాదులో పరిస్థితి రోజు రోజుకూ విషమిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర బాధకు, వేదనకు గురవుతున్నారు. వారు ఎవరి పట్ల అకృత్యాలకు పాల్పడకపోయినప్పటికీ వారిపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. వారిని తప్పకుండా విజయలక్ష్మి వరిస్తుంది. సత్యం కోసం వారు చూపుతున్న సాహసాన్ని, పోరాటాన్ని నేను ప్రశంసిస్తున్నాను.

జవహర్ లాల్ నెహ్రూ ఇలా చెప్పారు - హైదరాబాద్ ప్రజలు మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ప్రజలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా, వారికి న్యాయం జరిగేందుకు అన్ని పార్టీలు పోరాటం చేయాలి.

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X