వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్‌'ను చిదంబరం అందుకే లాగారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
రెండు రోజుల క్రితం తెలంగాణ అంశంపై పార్లమెంటు దద్దరిల్లిన సమయంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం అనూహ్యంగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీని ఈ అంశంలోకి తీసుకు వచ్చాడు. అయితే తెలంగాణ అంశంపై వైయస్సార్సీ పార్టీ పేరును ప్రస్తావించడం వెనుక ఓ ఎత్తుగడ ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2004 ఎన్నికల ముసాయిదాలోనే తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెసు పార్టీకి ఇప్పటి వరకు సమయమే చిక్కలేదా అని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. అందుకు చిదంబరం రాష్ట్రంలోని పార్టీలలో ఏకాభిప్రాయం లేక పోవడం వల్లనే సమస్య పరిష్కారం కావడం లేదని, సమస్య కేంద్రం చేతుల్లో లేదని చెప్పారు.

తెలంగాణకు ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు తమ అభిప్రాయం చెప్పలేదని చెబుతూ అభిప్రాయం చెప్పని పార్టీలలో వైయస్ జగన్ పార్టీ పేరు ప్రస్తావించారు. ఇదో హాట్ టాపిక్ అయి కూర్చుంది. చిదంబరం జగన్ పార్టీని ఎందుకు ప్రస్తావించాడనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెసు పార్టీలో ఉండి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకున్న వైయస్ జగన్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. కాంగ్రెసుతో పాటు ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల నుండి ఆయన పార్టీలోకి వలసలు భారీగా ఉన్న నేపథ్యంలో జగన్ పార్టీని ఇరుకున పెట్టే వ్యూహంలో భాగంగానే కాంగ్రెసు అధిష్టానం జగన్ పార్టీ పేరును చిదంబరం నోటి నుండి వచ్చేట్లుగా చేసిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెసుకు జగన్‌ను ఇరుకున పెట్టాలనే వ్యూహమే లేకుంటే జగన్ పార్టీ కన్నా ఎన్నో ఏళ్ల ముందు గుర్తింపు పొందిన లోక్ సత్తా పార్టీ పేరును ఎందుకు ప్రస్తావించలేదనేది కొందరి ప్రశ్న. ఇప్పుడే కాకుండా గతంలోనూ లోక్ సత్తా పేరును చిదంబరం ప్రస్తావించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలోని అఖిలపక్షానికి టిడిపి, బిజెపి, కాంగ్రెసు వంటి అన్ని పార్టీలను పిలిచినప్పటికీ లోక్ సత్తాను ఎందుకు పిలవలేని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమయానికి జగన్ పార్టీ ఇంకా పురుడు పోసుకోలేది. ఆ పార్టీ ఏర్పడి కనీసం ఆరు నెలలు కూడా కాలేదు. అలాంటి పార్టీ తన వైఖరి చెప్పలేదని చిదంబరం పార్లమెంటు వేదికగా ఎలా చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ను తెలంగాణ చిక్కులో ఇరికించి రాజకీయంగా దెబ్బకొట్టాలనే అలాంటి వ్యాఖ్యలు చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
It was clearly evident from the way Chidambaram had strategically took the name of YSR Congress party, while replying to the debate on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X