హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరీష్ కవ్వింపు: నోరు జారుతున్న కాంగ్రెసు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao-Kiran Kumar Reddy
హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో శాసనసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉచ్చులో పడిపోతున్నామా అనే అంతర్మథనం కాంగ్రెసు పార్టీలో ప్రారంభమైంది. తెలంగాణ సెంటిమెంటును ఆధారం చేసుకుని కాంగ్రెసును దెబ్బ తీసే విధంగా తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెసు శానససభ్యులు అనుకుంటున్నారు. హరీష్ రావు తన వ్యాఖ్యలతో రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించే విధంగా వ్యవహరిస్తున్నారని, దీంతో కాంగ్రెసు తెరాస ఉచ్చులో పడుతోందని వారు భావిస్తున్నట్లు సమాచారం.

తన వ్యాఖ్యలతో కవ్వింపు చర్యల కు పాల్పడి కాంగ్రెస్‌ నేతలు నోరుజారేలా చేయడం తెరాస ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు. సభను తప్పుదోవ పట్టించేలా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు మాట్లాడినా తెలంగాణపై తేల్చేది కాంగ్రెస్‌ పార్టీయేనన్న సమాధానంతోనే సరిపెట్టినా బాగుంటుందని చెబుతున్నారు. లేనిపక్షంలో టీఆర్‌ఎస్‌ ఉచ్చులోకి తాము చిక్కుకొనే ప్రమాదం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది, కాలర్‌పట్టుకొని అడిగితే ఒక్క మెడికల్‌ కాలేజీని ఈ ప్రాంతానికి ఇచ్చారు అని హరీష్‌రావు శాసనసభలో ప్రకటించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కాలర్‌పట్టుకొని అడిగితే ఇచ్చారు అన్న పదంలోనే కవ్వింపు చర్య లు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అందుకే సీఎం కూడా ప్రతిస్పం దనగా ఎవరికి భయపడను రూపాయి ఇవ్వను ఏం చేసుకొంటావో చేసుకోపో అని స్పందించారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. తెరాస జనంలోకి వ్యతిరేక ప్రకటనగా తీసుకెళ్లి లబ్ధి పొందాలని చూస్తోందని తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని, అసెంబ్లీలో తీర్మా నం చేయాలని ఉద్దేశపూర్వకంగానే మళ్లీ హరీష్‌రావు డిమాండ్‌ చేశారని, అన్ని పార్టీల్లోని నేతలు ప్రాంతాల వారీగా విడిపోయి నప్పుడు తీర్మానం నెగ్గడం సాధ్యంకాదని ఇది తెరాసకు కూ డా తెలుసని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. కేంద్ర నిర్ణ యం వస్తే తాము ఏదైనా చేస్తామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో కూడా వాస్తవం ఉందని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం చేయా ల్సింది కేంద్రమేనని చెబుతున్నారు.

రెండో ఎస్సార్సీకి ఎన్నికల పొత్తు సమయంలో తెరాసలో అప్పుడు నేతగా కొనసాగుతు న్న నరేంద్ర ఆ పార్టీ తరపున అంగీకరించి సంతకం చేసిన విషయం వాస్తవమని అన్నారు. ఇదే వాస్తవాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారని అంటున్నారు. అయితే, దాన్ని తెరాస మరో విధంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి కాంగ్రెసు తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా లేదనే రీతిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్తోందని అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ నేతల్లో మాత్రం ఆందోళన పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
Congress Telangana leaders are expressing concern over the Telangana Rastra Samithi (TRS) MLA Harish Rao comments and CM Kiran kumar Reddy's replies on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X