వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టార్ అట్రాక్షన్: చిరంజీవి వర్సెస్ నరేంద్ర మోడీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi and Narendra Modi
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలు త్వరలో జరుగనున్న కర్నాటక ఎన్నికల ప్రచారం పాల్గొననున్నారు. మోడీ తన పాలన పటిమతో దేశవ్యాప్తంగా అభిమానులను గెల్చుకొని ప్రధాని పదవి రేసులో ఉన్నారు. ఇక చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా ఎదిగి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు.

బిజెపి తరఫున మోడీ, కాంగ్రెసు తరఫున చిరంజీవి కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరుకు దక్షిణ భారత దేశంలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ కారణంగానే ఆయన గతంలో తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన కర్నాటకలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి నాలుగు రోజుల క్రితం మాట్లాడుతూ... చిరుతో కలిసి తాము కర్నాటకలో కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తామని చెప్పారు.

మరోవైపు మోడీ కూడా బిజెపి తరఫున ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీని కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రచార ప్రారంభ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, అనంతకుమార్, ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొంటారని ఆయన చెప్పారు.

శనివారం ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఐదు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. దక్షిణాదిన ఇమేజ్ గల స్టార్ చిరంజీవి, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మోడీ కర్నాటకలో వేర్వేరు పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొననుండటం గమనార్హం.

English summary

 GUjarat CM Narendra Modi and Central Tourism Minister Chiranjeevi may participate in Karnataka elections campaign for BJP and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X