చివరి క్షణంలో సీన్‌లోకి ఆయన: చంద్రబాబు ఆలోచన ఇదీ...

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టిడిపి) రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అనూహ్యమైన పేరు ఖరారైంది. చివరి క్షణంలో పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ పేరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.

  అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నాలేవీ చెయ్యని జగన్ | Oneindia Telugu

  సిఎం రమేష్‌ను మరోసారి రాజ్యసభకు పంపిస్తూ రవీంద్ర కుమార్‌కు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. రమేష్‌తో పాటు పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దక్కుతుందని శనివారం రాత్రి వరకు అనుకుంటూ వచ్చారు. కానీ చివరి నిమిషంలో సీన్ మారి రవీంద్ర కుమార్ తెర మీదికి వచ్చారు.

   వర్ల రామయ్యకు అభనందనలు కూడా...

  వర్ల రామయ్యకు అభనందనలు కూడా...

  టికెట్ లభించినట్లేనని భావించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్యను అభినందించారు కూడా. నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పారు. కానీ చివరి నిమిషంలో ఆయన పేరు వెనక్కి వెళ్లింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. వర్ల రామయ్యను ఎందుకు ఎంపిక చేయలేదని మీడియా ప్రతినిధులు సోమవారం అడిగితే ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో పార్టీ అలా ఉపయోగించుకుంటుందని మంత్రి జవహర్ సమాధానం ఇచ్చారు.

   న్యాయరంగంలోనివారి ఆశీస్సులు

  న్యాయరంగంలోనివారి ఆశీస్సులు

  న్యాయరంగంలోని పెద్దల ఆశీస్సులతో కనకమేడల రవీంద్ర కుమార్ పేరు తెర మీదికి వచ్చినట్లు చెబుతు్న్ారు. అంతేకాకుండా, విభజన సస్యలు, ఇతర న్యాయపరమైన అంశాల కారణంగా చట్టాలపై అవగాహన ఉన్నవాళ్లు ఢిల్లీలో ఉంటే బాగుంటుందని చంద్రబాబు భావించినట్లు చెబుతున్నారు. అందుకే రవీంద్ర కుమార్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

  వారంతా ఆశ్చర్యపోయారు...

  వారంతా ఆశ్చర్యపోయారు...

  పార్టీ ముఖ్యులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు రవీంద్ర కుమర్ పేరును ప్రస్తావించారు. అయితే, వారు అంతగా పట్టించుకోలేదు. కానీ ఆదివారం జరిగిన రెండో విడత చర్చల్లో చంద్రబాబు ఆయన పేరును ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. సిఎం రమేష్, రవీంద్ర కుమార్ పేర్లను ప్రకటించడానికి ముందు చంద్రబాబు తన నివాసంలో కొద్ది మంది పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు.

  ఇలా కనకమేడల రవీంద్ర కుమార్...

  ఇలా కనకమేడల రవీంద్ర కుమార్...

  కనకమేడల రవీంద్ర కుమార్ గత 22 ఏళ్లుగా టిడిపి న్యాయ విభాగంలో పనిచేస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ విభాగానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఇతర పార్టీలు దాఖలు చేసిన కేసుల్లో, పారటీ ఇతర నేతలపై పెట్టిన కేసుల్లో ఆన న్యాయసహాయం అందించారు.

  ఆయనకు అలా తప్పిపోయింది..

  ఆయనకు అలా తప్పిపోయింది..

  కనకమేడలకు రెండు సార్లు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అయితే అప్పుడు ఇతర కారణాల వల్ల తప్పిపోయింది. ప్రకాశం జిల్లా రాజకీయ సర్దుబాట్ల కారణంగా ఓసారి కరణం బలరామ్‌కు టికెట్ ఇవ్వడంతో, మరోసారి నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఫరూక్‌కు ఇవ్వాల్సి రావడం వల్ల కనకమేడలకు అవకాశం రాలేదు. సహనంతో ఎదురు చూసిన ఆయనకు మంచి ఫలితమే దక్కిందని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chnadrababu Naidu finalised the name of Kanakamedala Ravindra kumar for Rajya sabha elections.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి