ఆర్థిక అత్యవసర సమయాల్లో అండగా నిలిచే 'ఫిన్నబుల్' ఇన్స్‌టంట్ పర్సనల్ లోన్!

జీవిత ప్రయాణంలో కష్టాలు ఎప్పుడు ఎటు నుండి వస్తాయో ఎవరూ ముందే ఊహించలేరు.అకస్మాత్తుగా వచ్చిపడే అనారోగ్యం,పిల్లల విద్యా ఖర్చులు,లేదా అత్యవసర నివాస మరమ్మతులు వంటివి మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను ఒక్కసారిగా తలకిందులు చేస్తాయి.చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో,ఎవరిని అడగాలో తెలియక మనసులో కలిగే ఆందోళన,అభద్రతాభావం వర్ణనాతీతం. ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా సరిపడా డబ్బు సర్దుబాటు కాకపోతే కలిగే మానసిక వేదన ఎంతో తీవ్రంగా ఉంటుంది.

అత్యవసర సమయంలో చేబదులు దొరక్క చాలామంది సాంప్రదాయ బ్యాంకుల తలుపులు తడుడుతుంటారు.అయితే అక్కడ సుదీర్ఘమైన లోన్ ప్రక్రియల చుట్టూ తిరగడం ఒక మానసిక నరకంగా మారుతుంది.రోజులు గడుస్తున్నా పర్సనల్‌లోన్ మంజూరు కాకపోవడం,భారీగా పత్రాలు అడగడం ఒక ఎత్తు అయితే,కేవలం సిబిల్ స్కోర్ తక్కువగా ఉందనే కారణంతో దరఖాస్తును తిరస్కరించడం తట్టుకోలేని దెబ్బ.ఆపదలో ఉన్నప్పుడు బ్యాంకులు ముఖం చాటేస్తే నిస్సహాయుడైన ఉద్యోగి పడే ఆవేదనను మాటల్లో చెప్పలేం.

need-money-urgently-finnable-personal-loan-up-to-10-lakh-eligibility-interest-and-emi

నిరాశలో వెలుగులు నింపుతున్న డిజిటల్ రుణాలు

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూరుకుపోయిన ఉద్యోగులకు చేదోడుగా నిలిచేందుకు ఆధునిక డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రధాన మార్గంగా మారుతున్నాయి.వాటిలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న యాప్ ఫిన్నబుల్(Finnable).దేశంలోని సుమారు 190కి పైగా నగరాల్లో విజయవంతంగా సేవలు అందిస్తున్న ఈ ప్లాట్‌ఫారమ్,మధ్యతరగతి ఉద్యోగుల అత్యవసర సమయాల్లో ఎంతగానో ఆదుకుంటోంది.ఇప్పటివరకు దాదాపు 2.7 లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పర్సనల్ లోన్స్ పొంది ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కారు.

సమయం చాలా తక్కువగా ఉండి,అత్యవసరంగా నిధులు అవసరమైన వారికి ఈ డిజిటల్ రుణ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది.బ్యాంకుల చుట్టూ,సిబ్బంది చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే శ్రమను తగ్గించి,మీ మొబైల్ నుంచే లోన్ అప్లై చేసుకునే వీలు కల్పిస్తుంది.దరఖాస్తుదారుల అర్హత, పత్రాల పరిశీలన అంతా సజావుగా సాగితే,కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే లోన్ ఆమోదించబడి నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా భయం వద్దు

సాధారణ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణం పొందడానికి కనీసం 700 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉండాలని నియమం చెప్తుంటారు.లేదంటే దరఖాస్తును పరిశీలించకుండానే పక్కన పడేస్తారు. కానీ ఫిన్నబుల్ విధానం ఇందుకు భిన్నంగా ఉంటుంది.కేవలం సిబిల్ స్కోర్ మాత్రమే కాకుండా,దరఖాస్తుదారుడి ఉద్యోగ స్థిరత్వం,ఆదాయం,ఇతర ప్రొఫైల్ శాతాలను క్షుణ్ణంగా అంచనా వేస్తుంది. దీనివల్ల తక్కువ రేటింగ్ ఉన్నప్పటికీ అర్హులైన వారికి లోన్ పొందే మార్గం సులభతరం అవుతుంది.

need-money-urgently-finnable-personal-loan-up-to-10-lakh-eligibility-interest-and-emi

అయితే సిబిల్ స్కోర్ స్వల్పంగా తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లలో కొంత వ్యత్యాసం ఉండొచ్చని గమనించడం ముఖ్యం.ఈ యాప్‌లో రూ. 10 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను పొందవచ్చు.లోన్ కాలపరిమితిని దరఖాస్తుదారులు వారి వ్యక్తిగత బడ్జెట్ ఆధారంగా కనీసం 6 నెలల నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఎంపిక చేసుకోవచ్చు.అంతేకాకుండా ఈ రుణాలపై కనీస నెలవారీ ఈఎంఐలు కేవలం రూ.3,000 నుంచే ప్రారంభం కావడం విశేషం.

అర్హత ప్రమాణాలు, వడ్డీ లెక్కలు

ఈ తక్షణ వ్యక్తిగత రుణం పొందడానికి అర్హత నిబంధనలు చాలా సులువుగా ఉంటాయి.దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి మరియు కనీసం రూ.15,000 నెలవారీ జీతం కలిగి ఉండాలి. ఈ వేతనం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుండాలి.అలాగే ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థలలో కనీసం మూడు నెలల పని అనుభవం ఉండి,21 నుండి 55 సంవత్సరాల వయసుగల ఉద్యోగులు మాత్రమే ఈ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ ప్రత్యేక తక్షణ రుణాలు కేవలం నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగుల కోసమే రూపొందించబడ్డాయి.స్వయం ఉపాధి లేదా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇవి వర్తించవు.ఇక్కడ వార్షిక వడ్డీ రేట్లు 16 శాతం నుండి ప్రారంభమై గరిష్టంగా 30.99 శాతం వరకు ఉండవచ్చు.వడ్డీ రేట్లు అనేవి దరఖాస్తుదారుడి ప్రస్తుత ఆదాయం మరియు ఉద్యోగ స్థితి ఆధారంగా మారుతుంటాయి.వీటితో పాటు 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు,జీఎస్‌టీ అదనంగా వర్తిస్తాయి.

సమస్య ఏదైనా సలక్షణమైన వెసులుబాటు

పర్సనల్ లోన్లను కేవలం వైద్య అత్యవసరాల కోసమే కాకుండా పిల్లల విద్యా ఖర్చులు,ఇళ్ల పునర్నిర్మాణ పనులు ఇంకా ప్రయాణాల కోసం కూడా వినియోగించవచ్చు.అలాగే వివాహ ఖర్చుల కోసం రూ. 10 లక్షల వరకు ప్రత్యేక లోన్ అందించబడుతోంది.కుటుంబ కష్టాలను గట్టెక్కించేందుకు ఫిన్నబుల్ ప్రవేశపెట్టిన ఆశీర్వాద్ లోన్ ఎంతో ప్రయోజనకరమైనది.ఈ లోన్ ద్వారా ఆపద సమయంలో పెద్ద మొత్తంలో ఉండే హాస్పిటల్ బిల్లులతో పాటు కుటుంబ సంరక్షణ ఖర్చులను సులభంగా ఎదుర్కోవచ్చు.

ఫిన్నబుల్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని పాన్ కార్డ్,ఆధార్ కార్డ్,శాలరీ స్లిప్స్ మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్స్ వంటి పత్రాలను సులభంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా విభిన్న అవసరాల కోసం దరఖాస్తు చేయడానికి ముందే యూజర్లు తమ క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల లోన్ అప్లై చేయడానికి ముందే మన ఆర్థిక అర్హతలపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.

అత్యవసర సమయాల్లో వేగవంతమైన ఆర్థిక భరోసా పొందేందుకు,అలాగే పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఫ్లెక్సిబుల్ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఫిన్నబుల్ వెబ్‌సైట్ https://www.finnable.com/ని సందర్శించవచ్చు.ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవడానికి ఫిన్నబుల్ పర్సనల్ లోన్ పేజీ(https://www.finnable.com/personal-loan/) ఉపయోగపడుతుంది.

సాధారణ ఉద్యోగుల అవసరాలను గుర్తించి,ఆధునిక సాంకేతికతతో ఆర్థిక ఊరటను కల్పిస్తోంది ఫిన్నబుల్ డిజిటల్ లెండింగ్.అత్యవసర నిర్ణయాలతో అల్లాడిపోతున్న వారికి కేవలం 60 నిమిషాల్లోనే గరిష్టంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందడం అనేది ఈ రోజుల్లో ఎంతో గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.ఒక పక్క నమ్మకమైన కస్టమర్ రేటింగ్స్,మరోపక్క శీఘ్ర అప్రూవల్ విధానంతో కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తూ ఎందరో కుటుంబాల్లో ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆనందాన్ని నింపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+