ఎయిర్‌పోర్టులో 600 ఉద్యోగాలకు బారులు తీరిన నిరుద్యోగులు...
దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. అందుకు ఉదాహరణే ముంబైలోని ఎయిర్‌పోర్టులో జరిగిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్. ముంబైలోని కలినా విమానాశ్రయంలో తాజాగా మెకానిక్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 600 ఎయిర్‌పోర్ట్ లోడర్ల పోస్టుల కోసం ఎయిర్ ఇండియా సంస్థ వాకిన్ ఇంటర్వ్యూను చేపెట్టింది. ఈ ఇంటర్వ్యూలో తొక్కిసలాట జరిగింది.
ఆరువందల పోస్టుల కొన్ని వేల మంది నిరుద్యోగులు పోటీపడ్డారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూకు సుమారు 25 వేల మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. దీంతో ఎయిర్‌పోర్టు వద్ద పరిస్థితి కాస్త అదుపు తప్పింది. ఈ ఇంటర్వ్యూకు వచ్చిన జనాన్ని అదుపు చేసేందుకు ఎయిర్ ఇండియా సిబ్బంది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

కలినా ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా సంస్థ లోడర్ల కోసం వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. విమానాల్లో ఉండే లగేజీ, కార్గోను లోడర్లు చూసుకుంటారు. లగేజీని లోడింగ్, అన్‌లోడింగ్ చేసేందుకు ఎయిర్ పోర్టు లోడర్లను నియమిస్తుంటారు. విమానాశ్రయాల్లో ఉండే లోడర్లు బ్యాగేజీ బెల్టులు, ర్యాంప్ ట్రాక్టర్లను ఆపరేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విమానానికి చెందిన లగేజీ, కార్గో, ఫుడ్ సప్లయ్‌లో కనీసం ఒక అయిదు మంది లోడర్లు తప్పనిసరి.
ఇందుకోసం ఎయిర్ ఇండియా వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇక, ఈ ఉద్యోగాలకు బయోడేటా ఫామ్‌లు ఇచ్చేందుకు నిరుద్యోగ యువత ఎగబడ్డారు. కొన్ని గంటల పాటు యువత అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. తాగేందుకు నీరు, ఆహారం లేకుండా అలాగే చాలాసేపు ఇంటర్వ్యూ కోసం ఉండిపోయారు. ఇక అందులో కొంతమంది యువత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
This is Mumbai's Kalina, where a massive crowd of job seekers emerged as the Air India Airport Services Ltd announced walk-in interviews.
— Vani Mehrotra (@vani_mehrotra) July 16, 2024
The situation soon went out of control and the candidates were asked to leave their CVs and vacate the area.#Mumbai #AIAirportServices pic.twitter.com/vZoLDf40iz
ఎయిర్ పోర్టు ఉండే లోడర్ల జీతం నెలకు రూ. 20 నుంచి 25వేలు ఉంటుంది. ఓవర్‌టైమ్ చేసినవారికి ఆ జీతం రూ. 30వేల వరకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ పెద్ద నిరుద్యోగ యువత క్యూ కట్టారు. ఎయిర్‌పోర్ట్ రిక్రూట్మెంట్ ఆఫీస్ దగ్గర తీవ్ర గందరగోళం నెలకొంది. వీరిని అదుపుచేయలేక, రెజ్యూమ్స్ ని ఆఫీస్ లో ఇచ్చి వెళ్లాలని, తర్వాత షార్ట్ లిస్ట్ చేసి కాల్ చేస్తామని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్‌పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications