వినియోగదారులకు షాక్.. మరోసారి కొండెక్కిన టమాట ధరలు..
వినియోగదారులకు షాక్.. మరోసారి టమాట ధరలు భారీగా పెరిగిపోయాయి. నిన్న మొన్నటి దాకా టమాట ధరలు తగ్గాయని సంతోషపడిన సామాన్యులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. మరోసారి టమాట ధరలు పెరిగి సామాన్యుల నెత్తిన గుడిబండలా తయారయ్యాయి.
ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో సామాన్యులు అల్లాడిపోతుంటే.. ఇప్పుడు కూరగాయాల ధరలు కూడా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని మాసాలుగా కూరగాయాలు ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక, నిన్నమొన్నటిదాకా తగ్గుముఖం పట్టిన టమాట ధరలు కూడా ఇప్పడు అమాంతం పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం కిలో టామాటా ధర 80 రూపాయల నుంచి 100 రూపాయలు పలికింది. అయితే, వీటి ధరలు ఇటీవలి కాస్త తగ్గినట్లు అనిపించిన.. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. గత మూడు నాలుగురోజుల క్రితం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో టమాట రూ.40-50కి లభించింది. కానీ, ఇప్పడు అదే కిలో టామాటా 60-70 రూపాయలు పలుకుతుంది. ఇక, ఇతర బహిరంగ మార్కెట్‌లో అయితే ఏకంగా టమోట ధర సామాన్యులు కొనేలా లేదు. 100 రూపాయలు చెబుతున్నారు.
అయితే, వీటి ధరలు పెరగడానికి దిగుబడే కారణమని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రతి రోజూ పట్టణంలో ఉండే రైతుబజార్లకు ఆరువేల క్వింటాళ్ల టమాలు వచ్చేవి. ఇప్పడు 2.5 నుంచి 3వేల క్వింటాళ్లు మాత్రమే రైతుబజార్లకు వస్తున్నాయి. తొలకరి పంట ఇంకా చేతికి రాకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అధికారులు అంటున్నారు.
సెప్టెంబర్ నెల వరకు దిగుబడి వచ్చే అవకాశం లేదని, ఇదే పరిస్థితి కొనసాగే ఛాన్స్ ఉంటుందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు. ఇక, వర్షాలు కూడా వీటి ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉండొచ్చు. ఇటు హైదరాబాద్, మదనపల్లి, రాజస్థాన్ నుంచి వచ్చే టమాటా కూడా చాలామేరకు తగ్గడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా సామాన్యులు ఇక టమాటను కొనే పరిస్థితి కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications