చిరంజీవిపై పోలీసు 'గురి'!

అయితే హైకోర్టు స్టే ఎత్తేయడం చిరంజీవికి లాభించే అంశమైనా ఒక ఫిటింగ్ ఉంది. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ మార్గదర్శకాలకు లోబడి రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని కోర్టు చెప్పింది. ఇక్కడే ఒక మెలిక ఉంది. ఆ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోలేదని చిరంజీవిపై పోలీసులు రోజుకో కేసు బుక్ చేసే అవకాశముంది. పోలీసు అధికారులు అధికారంలో ఉన్న పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుతారన్న విషయం తెలిసిందే. చిరంజీవి రోడ్ షోల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోందన్న కారణంపై చిరంజీవిపై కేసులు నమోదు చేసే అవకాశముంది. అయితే అలా చేస్తే ఆయనపై సానుభూతి పెరుగుతుందన్న వాస్తవాన్ని కూడా ప్రభుత్వం గుర్తించే ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించమని పోలీసులకు సూచించవచ్చు.












Click it and Unblock the Notifications