బెజవాడ గోలపై వర్మ సినిమా?

Ramgopal Varma
అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాగా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ దృష్టి ఇప్పుడు విజయవాడ ముఠా రాజకీయాల మీద పడినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా కంటే పసందైన కథ విజయవాడ కృష్ణానది సాక్షిగా గత యాభై ఏళ్ళుగా సాగుతోంది. అనంతపురంలో కులాంతర వివాహం అనే అంశం లేదు. విజయవాడ కథలో కమ్మ కులానికి చెందిన రత్నకుమారి వారికి విలన్ వంటి రంగాను పెళ్ళి చేసుకుని వంగవీటి రత్నకుమారిగా మారింది. ఎన్టీఆర్ హయాంలో రంగా హత్య తర్వాత్ ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందింది.

రంగా హంతకుడని పేరు పడ్డ దేవినేని నెహ్రూకు క్లీన్ చిట్ లభించింది. నెహ్రూ కాంగ్రెస్ లోకి మారడం, రత్నకుమారి తెలుగుదేశం లోకి వెళ్ళడం- దేనికి నిదర్శనం? ఇక్కడ కులం కాదు, ఇన్ ఫ్లు యెన్స్, ఇతర అవకాశవాదాలు ముఖ్యం. ఇంత మసాలా అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాల్లో లేదు.

వంగవీటి రంగాకు, రత్నకుమారికి జన్మించిన తనయుడు రాధాకృష్ణ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావడం కథలో ఒక మలుపు అయితే, అతనే తన కులానికి చెందిన చిరంజీవి పార్టీలో చేరిపోవడం మరో పెద్ద మలుపు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సామాజిక వ్యవస్ధ మీద ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్న రామ్ గోపాల్ వర్మ మంచి సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+