కమ్మ ఓట్లలో చీలిక?

Jayaprakash Narayan
ఈసారి కమ్మవారి ఓట్లు కట్టకట్టుకుని తెలుగుదేశం పార్టీకి పడతాయని అంచనా వేసిన విశ్లేషకులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. జయప్రకాష్ నారాయణ నాయకత్వంలోని లోక్ సత్తా పార్టీ మెజారిటీ లోక్ సభ, అసెంబ్లీ స్ధానాల్లో బరిలోకి దిగడంతో కమ్మ ఓట్లలో గణనీయ భాగం ఆ పార్టీ అభ్యర్ధులకు పడే అవకాశాలు కన్పిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్ధితిని బట్టి లోక్ సత్తాకు గెలిచేటన్ని ఓట్లు రాకపోయినా, చాలా స్ధానాల్లో పదిశాతం వరకు ఓట్లు పడే అవకాశముందని అంచనా. గతంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన విద్యావంతులు, యువకులు, కమ్మ కులస్ధులు లోక్ సత్తా వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది.

ఈ ట్రెండ్ ను కనిపెట్టే మల్కాజ్ గిరి లోక్ సభ స్ధానానికి విజ్ణాన్ రత్తయ్యను నిలబెట్టి ఆ పరిధిలోకి వచ్చే కుకట్ పల్లి అసెంబ్లీ స్ధానం నుంచి జయప్రకాష్ పోటీ చేస్తున్నారు. కుకట్ పల్లి పరిధిలో కమ్మ ఓట్లు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. కులాలతో నిమిత్తం లేకుండా ఉద్యోగులు కూడా లోక్ సత్తాకు ఓటు వేసే అవకాశముంది. జెపి ఇక్కడ గెలుపొందితే లోక్ సభ పరిధిలో రత్తయ్యకు కూడా బాగా ఓట్లు వచ్చే అవకాశముంది. కుకట్ పల్లిలో తెలుగుదేశం గెలుపు అవకాశాలు జెపి వల్ల బాగా తగ్గిపోయాయి. క్లీన్ ఇమేజ్ లోక్ సత్తాకు శ్రీరామ రక్ష. అయితే అయిదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల్లో అయినా ఈ పార్టీ గెలుపు గుర్రం కాగలదని ప్రగతిశీల వాదుల ఆకాంక్ష.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+