కెసిఆర్ పై మాజీ ఎమ్మెల్యేల ఆగ్రహం!

ఇలా ఉండగా ఉప ఎన్నికలు ఏకగ్రీవం కావాలన్న తెలంగాణ వాదుల ఆశలు నెరవేరేటట్టు లేవు. కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్ధులు రంగంలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలోని తెలంగాణలో ఖాళీ అయిన 12 శాసనసభా నియోజకవర్గాలకు ఆగస్టు 14వ తేదీ లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని భారత ఎన్నికల కమీషనర్ ఖురేషీ చెప్పారు. ఆగస్టు 14వ తేదీ లోపు ఎప్పుడైనా ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. అయితే, కచ్చితమైన తేదీని ఆయన చెప్పలేదు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ 10మంది తెలంగాణ రాష్ట్రసమితి (తెరాస) శాసనసభ్యులు, తెలుగుదేశం సభ్యుడు ఒకరు, బిజెపి సభ్యుడు ఒకరు రాజీనామా చేశారు. దీంతో ఆ 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.












Click it and Unblock the Notifications