బాలయ్యను నమ్మలేకపోతున్న లక్ష్మీ పార్వతి

అప్పుడు బాలయ్యను తన ఇంటికి ఎందుకు పంపించారో లక్ష్మీపార్వతికి అనుభవంలోకి వచ్చినట్టుంది. ఇటీవల ఒక టీవీ చాన్ల్ కి ఇచ్చిన కార్యక్రమంలో ఆమె ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మీద దాదాపు దుమ్మెత్తి పోశారు. ప్రజలు పార్టీ కోసం ఇచ్చిన డబ్బును కూడా తన నుంచి లాక్కుని, తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగేలా చేయాలన్నది ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కుట్ర అని ఆమె వెల్లడించారు. బాలయ్య వెనుక చంద్రబాబు, హరికృష్ణల కుట్రలు ఉన్నాయని, అంత తేలిగ్గా నమ్మేసి ఎక్కడా సంతకాలు పెట్ట వద్దని పార్వతి సలహాదారులు వారించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబుకు బద్ధ శత్రువుగా ఉన్న దగ్గుబాటిని కూడా అమె ఫోన్ లో సలహా అడిగినట్టు చెబుతున్నారు. ఆయన కూడా జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చారట.












Click it and Unblock the Notifications