ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చోటు కోసం రాజకీయ నాయకురాలు, సినీ నటి రోజా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. చిరంజీవితో డ్యాన్స్ చేయడానికి ఆమె ఉవ్విళ్లూరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో తాము కలిసి నటించిన సినిమాలు విజయం సాధించాయని, తాము కలిసి చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయని ఆమె తన 37వ జన్మదినం సందర్భంగా ఓ ప్రైవేట్ తెలుగు చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్ని బట్టి ఆమె చిరంజీవి 150వ చిత్రంలో నటించేందుకు తపన పడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కనీసం రోజాకు తనతో డ్యాన్స్ చేసేందుకైనా అవకాశం ఇస్తారా అనేది తేలాల్సిన విషయం. రాజకీయంగా మాత్రం రోజా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంటే ఉండడానికి నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో చిరంజీవిపై విమర్శనాస్త్రాలు రోజా ఎడతెగని విమర్శనాస్త్రాలు సంధించారు. గత ట్రాక్ రికార్డు వల్ల చిరంజీవి రోజాతో డ్యాన్స్ చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే. అలా చాన్స్ ఇస్తే అది సినిమాకు కమర్షియల్ గా చిరంజీవికి కలిసి వచ్చే అవకాశం ఉంది.