ఏ వెలుగులకీ 'సాక్షి'?

జగన్ ముఖ్యమంత్రి అయితే ఇటువంటి ఐరావతాలను ఎన్నిటినైనా పోషించి ఉండే వాడు. ఆయన సిఎం కాలేదు. వచ్చే మూడేళ్ళలో ఆ పదవి దక్కుతుందన్న ఆశ లేదు. వస్తే గిస్తే ఎన్నికల ముందు అతని ఆ పదవి దక్కవచ్చు. అప్పటివరకు సాక్షి అనే తెల్లఏనుగును ఆ యన పోషించాలి. కాంగ్రెసు పార్టీ కోసం ప్రారంభమైన ఆ పత్రిక ఇప్పుడు కాంగ్రెసు కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. అంటే పార్టీ నిబద్ధత కాకుండా జగన్ నిబద్ధతతో పని చేస్తోంది. ఇటువంటి పత్రికల మనుగడ తాత్కాలికంగా రిమ్ జిమ్ గా కన్పించినా దీర్ఘకాలంలో కష్టమే. ధన బలం తప్ప సంపాదకీయ సత్తా ఒక్కటైనా ఉందా ఇన్నేళ్ళలో..రంగుల హంగులు తప్ప గుర్తుంచుకోదగిన ఒక మానవీయ కథనం ఈ పత్రికలో వచ్చిందా? ఏ వెలుగులకీ ప్రస్ధానం? కెరీరజమే తప్ప సమాజహితం ఎక్కడ? ఆలోచించండి.












Click it and Unblock the Notifications