ఈ నాగబాబు అన్నకోసం ఆవిరి!

చిరంజీవి మాత్రం తన తమ్ముడైనా తన పారితోషికాన్నిఠంచన్ గా పుచ్చుకునేవారట. అయితే తమ్ముడు నష్టపోతున్నాడన్న ఫీలింగ్ అన్నకు ఉండేది కాదు, ఎందుకంటే తను కాల్షీట్స్ ఇస్తే బయ్యర్లు ఎగబడి వస్తారని చిరంజీవికి తెలియదా? తాను తీసుకుంటున్నది బయ్యర్ల డబ్బే కానీ తమ్ముడి డబ్బు కాదని చిరంజీవి నమ్మకం. కానీ నష్టపోయిన బయ్యర్లను నాగబాబు మరో రకంగా ఆదుకుని తాను కొవ్వొత్తిలా కరిగిపోయేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద "ఆరెంజ్" లో రామ్ చరణ్ తేజ నటించాడు. బాబాయి బ్యానర్ అయినా రామ్ చరణ్ తన పారితోషికాన్ని మొహమాటం లేకుండా పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. సినిమా రంగంలో కరిగిపోయేది కొందరు, కలిమితో వెలిగిపోయేది కొందరు.












Click it and Unblock the Notifications