కోస్తాలో 'అదుర్స్' అడ్డుకోడానికి చిరు అభిమానుల ప్లాన్!

అయినా చిరంజీవి అభిమానులు ఆయన సిన్మాకు వ్యతిరేకంగా మారడం వెనుక సినిమా రాజకీయాలే కారణమని తెలుస్తోంది. ఈ సినిమా గనుక మెగా హిట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అగ్రహీరో అయిపోవడం ఖాయం. అదే జరిగితే చిరంజీవి కుటుంబ హీరోలు వెనుకబడిపోయే అవకాశముంది. కోస్తాలో "అదుర్స్" ను అడ్డుకోమని చిరు అభిమానులకు ఎవరు ఎస్ ఎం ఎస్ లు పంపుతున్నారో తెలుసుకోవడం అంత కష్టం కాదు. చిరంజీవి కుటుంబంలో అందరి పెట్టుబడులు చూసే వ్యక్తే ఈ ప్రేరేపణ చేసి ఉంటారని సినిమా వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో ఈ సినిమాను అనేక చోట్ల తెలంగాణ వాదులు నిలిపివేశారు. ఈ సినిమాకు ఈ విధంగా గొప్ప పబ్లిసిటీ వచ్చింది.












Click it and Unblock the Notifications