జగనే రాష్ట్ర మయం!

ఇప్పుడు జగన్ సినిమా ఫైనాన్స్ రంగంలోకి, ఆ తర్వాత నేరుగా సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించనున్నారు. హీరోల రెమ్యూనరేషన్లకే ఏడెనిమిది కోట్ల రూపాయలు తగలెయ్యడం ఇష్టం లేని జగన్నాయకులు ఇటీవల నిర్మాతల మండలితో హీరోల రెమ్యూనరేషన్ల మీద శ్లాబ్ విధింపజేసినట్టు తెలుస్తోంది. జగన్ బాలకృష్ణ అభిమాని అన్న విషయం చాలా మందికి తెలియదు. బాలకృష్ణ రెండుకోట్ల లోపే పారితోషికం తీసుకుంటూ నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. రెమ్యూనరేషన్ల విషయంలో కూడా బాలకృష్ణ జగన్ కు నచ్చినట్టు చెబుతున్నారు. ఇన్ని రంగాలకు విస్తరించిన జగన్ కు అన్నిటా విజయం కలగాలని వైయస్ అభి మానులు కోరుకుంటున్నారు. జగమే రామమయం అన్నట్టు జగనే రాష్ట్ర మయం అంటే బాగుంటుందేమో!












Click it and Unblock the Notifications