ముఖ్యమంత్రి రోశయ్య గుండెపై వైయస్ జ 'గన్ '!

YS Jagan
ఈనెల 9 నుంచి జగన్ జిల్లా పర్యటనలు ఖరారైన నేపధ్యంలో అసలే ఆరోగ్యం బాగుండని రోశయ్యకు చెమటలు పోస్తున్నట్టున్నాయి. జగన్ జగమొండిలా వ్యవహరిస్తున్నాడని, తమరు మొట్టికాయ వేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోతుందని రోశయ్య సోనియా గాంధీకి ఫోన్ లో చెప్పి బాధపడినట్టు సమాచారం. ఆయన ఈవారంలోనే ఢిల్లీ వెళ్ళి మంత్రివర్గ పునర్ వ్య్వస్ధీకరణకు అమ్మగారి అనుమతి పొందాలనుకుంటున్నారు. తన వర్గం మంత్రులను రోశయ్య ఎక్కడ పీకి పారేస్తారోనన్న ఆందోళనతో ఈనెల 9 నుంచి జిల్లాల్లో పర్యటించి తనకున్న జనబలమేమిటో నిరూపించుకోవాలని జగన్ అనుకుంటున్నారు.

రోశయ్య అంటే భయం కొద్దీ, హైకమాండ్ అంటే భక్తీ కొద్దీ మంత్రులు ప్రత్యక్షంగా జగన్ పర్యటనకు సహకరించకపోయినా మంత్రుల అనుచరులు మాత్రం బాహాటంగా మద్దతు ఇవ్వబోతున్నారు. భారీ ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. జగన్ మూడు రోజుల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సూపర్ హిట్ కాబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. రేపు వీరప మొయిలీ పార్టీ సమన్వయ సమావేశానికి హాజరు కానున్నారు. ఆయన జగన్ తో ప్రత్యేకంగా మాట్లాడి జిల్లా పర్యటనలను రద్దు చేసుకోమని కోరే అవకాశముంది. జగన్ అందుకు అంగీకరించకపోవచ్చు. జగన్ పైకి సౌమ్యుడిగా కన్పించినా అంతర్గతంగా అతనిలో ఆయన తాత రాజారెడ్డి ఉగ్రరూపం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ రూపం రోశయ్యను ఎంతవరకు భయపెడుతుందో 9 వతేదీన కానీ స్పష్టం కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+