మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్యగా తనను అంగీకరిస్తే చాలని రాష్ట్ర హక్కుల కమిషన్‌ను లక్ష్మీపార్వతి కోరారు. ఈ విషయమై గతంలో ఆమె దాఖలు చేసిన ఫిర్యాదుపై మంగళవారం కమిషన్ విచారణ జరిపింది. 'లక్ష్మీపార్వతిని రెండో భార్యగా ఎన్టీఆర్ అంగీకరించారు. తిరుపతి బహిరంగ సభలో ఆ విషయం ప్రకటించారు.. ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచింది కూడా లక్ష్మీపార్వతి వద్దే. అయితే ఎన్టీఆర్ చనిపోయాక ఆమె ఆయన భార్య కాదని వివాదం లేవదీశారు. ఆమెను క్షోభకు గురిచేస్తున్నారు' అని న్యాయవాది వాదించారు. దీనిపై తీర్పును హక్కుల కమిషన్ వాయిదా వేసింది.
Laxmi Parvathi appeals to HRC to announce her as late NT Rama Rao's wife. NTR announced at Tirupati public meeting that he was going marry Laxmi Parvathi.