కెసిఆర్, విజయశాంతి చెరో వైపు

అదే సమయంలో విజయశాంతి నిత్యం కాంగ్రెసుపై ధ్వజమెత్తుతారు. ఆమె కాంగ్రెసును సపోర్టు చేసిన సందర్భాలు ఒక్కటంటే ఒక్కటీ లేవు. కెసిఆర్ అప్పుడప్పుడు తెలంగాణ ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. కానీ విజయశాంతి కాంగ్రెసు ఉంటే తెలంగాణ రానే రాదని కొట్టి పారేస్తుంది. అంతేకాదు ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె కెసిఆర్ అమాయకంగా కాంగ్రెసును నమ్ముతున్నారన్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణపై బిజెపి స్పష్టంగా ప్రకటించినప్పటికీ కెసిఆర్ అద్వానీ యాత్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు మిన్నకుండి పోయారు. కానీ రాములమ్మ అద్వానీకి స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications