వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకాపై జగన్ దాడి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక జగన్ చిన్నాన్న, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన వైయస్ వివేకానందరెడ్డి శాసనమండలి ఎన్నికలలో అక్రమాలకు పాల్పడుతున్నారని, డబ్బులు ఎరజూపి ఎంపీటిసీలను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించింది. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించింది. వివేకానంద ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థి చదిపిరాళ్ల నారాయణరెడ్డి ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలికి పోటీ చేస్తున్న వరదరాజులు రెడ్డిని గెలిపించడానికి వివేకా శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పింది. అదే సమయంలో జిల్లాకు చెందిన మిగిలిన ఇధ్దరు మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూరం ఉండగా, జగన్ కుటుంబానికే చెందిన వివేకానంద మాత్రం జగన్‌ని దెబ్బ తీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది.

భారం అంతా వివేకాపై వేసి తక్కిన మంత్రులు తెలివిగా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించింది. వివేకా మాత్రం జిల్లాలో తిష్ట వేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, ఎంపీటీసీల ఇళ్లకు వెళ్లి బేరసారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నట్టు చెప్పింది. వివేకా స్వయంగా సుమారు 25 నుండి 30 మంది ఎంపీటీసీలను కాంగ్రెస్ శిబిరాలకు తరలించినట్లుగా సమాచారం ఉందని చెప్పింది. శాసనసభా సమావేశాలు జరుగుతున్నా ఆయన హైదరాబాద్ వెళ్లకుండా జిల్లాలోనే ఎన్నికలపై దృష్టి సారించారన్నది. అభ్యర్థి వరదరాజులు రెడ్డిని వెంట బెట్టుకొని ఎంపీటీసీల ఇళ్లకు వెళుతున్నట్టు చెప్పింది. మంగళవారం నుండి వివేకా ఎంపీటీసీల వేట ప్రారంభించారని తెలిపింది. వారితో ఏకాంతంగా సమావేశమై భేరసారాలు చేస్తున్నట్టు ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ఎంపీటీసీలతో మాత్రమే కాకుండా, టిడిపి ఎంపీటీసీలను కూడా బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకోసం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది.

ఎంపీటీసులు బొజ్జమ్మ, మురుగేష్ రెడ్డి వివేకాపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే మండలి ఎన్నికల్లో గెలవడానికి అందరికీ ఆఫర్లు ప్రకటిస్తున్నారని, వాటికి ఒప్పుకోని వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము జగన్‌కు మద్దతు తెలుపుతున్నందువల్ల తమను బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు జగన్‌కే మద్దతు తెలిపేందుకు ఇష్టపడుతున్నారని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడిలు తట్టుకోలేక పోతున్నామని వారు ఆరోపించారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy Sakshi daily targeted agriculture minister YS Vivekananda Reddy today. Sakshi accused Vivekananda attitude in MLC election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X