'దండం' చంద్రబాబు: ఇమేజ్ చేంజ్

అక్టోబర్ 2వ తేదీ నుంచి మీ కోసం వస్తున్నా పేరుతో చేపడుతున్న పాదయాత్రలో ఈ దండం ప్రధానం కానుంది. పాదయాత్ర కోసం రూపొందించిన ప్రచారం పోస్టర్లపై విక్టరీ సింబల్ చూపిస్తున్న చంద్రబాబు ఛాయాచిత్రానికి బదులు దండం పెడుతున్న ఫొటోను ముద్రించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా ఆవేశంగా ఎదుటివారి వైపు వేలెత్తి చూపుతూ ఉండడం ఆయన ప్రత్యేకమైన స్టయిల్‌గా ఉంటూ వస్తోంది.
పాదయాత్ర సందర్భంగా చేసే ప్రసంగాల్లో ఆయన ఆ శైలిని ప్రదర్శించబోరని, చాలా నెమ్మదిగా వ్యవహరిస్తారని అంటున్నారు. తన హావభావాలను మార్చుకోవడానికి చంద్రబాబు పార్టీ నాయకులతో, మానసిక నిపుణులతో, సినీ దర్శకులతో చర్చించినట్లు చెబుతున్నారు. ఇందులో ఏ మేరకు నిజం ఉందో తెలియదు గానీ ఆయన తన శైలిని మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.
తనను తాను శిక్షించుకుంటూ ప్రభావితం చేయడానికి పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. 63 ఏళ్ల వయస్సులో ఆయన 117 రోజుల పాటు పాదయాత్ర చేయడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైన ఆయన పాదయాత్ర వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ముగుస్తుంది. ఏమైనా, చంద్రబాబు సాహసమే చేస్తున్నారని చెప్పాలి.












Click it and Unblock the Notifications