జగన్‌కు టిఆర్ఎస్ మద్దతిస్తుందా?: కాంగ్రెస్ టెన్షన్

అయితే టిఆర్ఎస్ మాత్రం రాజ్యసభ సీటు విషయంలో జగన్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ విషయంలో జగన్‌కు, తెలుగుదేశం పార్టీకి పెద్దగా తేడా ఏమీ లేదని ఇలాంటి సమయంలో జగన్‌కు మద్దతిస్తే ఇటు తెలంగాణవాదుల్లో విశ్వాసం కోల్పోవడంతో పాటు విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతుందని టిఆర్ఎస్ నేతలు కొందరు చెబుతున్నారట. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెసుకు మద్దతివ్వడం వల్ల పార్టీకి నష్టం చేకూరిందని ఇప్పుడు జగన్‌కు మద్దతిస్తే అది మరింత నష్టం చేస్తుందని టిఆర్ఎస్ భావిస్తోందంట. అయితే జగన్ మాత్రం తన టిఆర్ఎస్ మద్దతు కోసం తన ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications