టిడిపి నేతలకు బాలకృష్ణ ఝలక్?

అయితే బాలయ్య వ్యాఖ్యలపై టిడిపిలో చర్చకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎక్కడి నుండి పోటీ చేస్తారనే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యల వెనుక వ్యూహమేమిటనే సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీలో ఇప్పటి వరకు చంద్రబాబే కేంద్రంగా ఉన్నారు. బాలయ్య రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైతే ఆయన రెండో పవర్ సెంటర్‌గా తయారవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపిలో నందమూరి కుటుంబానికి కూడా ప్రాధాన్యత తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తానని వ్యాఖ్యానించారని కొందరు అభిప్రాయపడుతుండగా, టిడిపికి లబ్ధి చేకూర్చేందుకే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలపై ఆచితూచి మాట్లాడుతున్న బాలయ్య పోటీ విషయంలో మాత్రం పార్టీ నేతల అభిప్రాయాలను వెంటనే కొట్టి పారేయటం గమనార్హం.












Click it and Unblock the Notifications