చిరంజీవి పర్యాటక కాన్సెప్ట్‌కు అవార్డు

గోల్డెన్ సిటీ గేట్ అవార్డు కోసం మొత్తం 45 చిత్రాలు పోటీపడ్డాయి. కాగా, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు గాను ఈ 'ఫైండ్ వాట్ యు సీక్' ప్రచార చిత్రాన్ని రూపొందించారు. అలాగే, దేశీయ పర్యాటకులను ఆకర్షించేందుకు గాను 'గో బియాండ్' అనే ప్రచారాన్ని కూడా పర్యాటక శాఖ జరుపుతోంది.
ఇదిలావుంటే, చిరంజీవికి జర్మనీలో కూడా తెలంగాణ సెగ తగిలింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకునేలా చూడాలని కేంద్ర మంత్రి చిరంజీవికి తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) జర్మనీ విభాగం విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఇప్పటికే యువకులు పెద్ద యెత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేసింది.
జర్మనీ పర్యటనలో ఉన్న చిరంజీవిని బెర్లిన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వేములవాడ శానససభ్యుడు చెన్నమనేని రమేష్ నేతృత్వంలోని టిడిఎఫ్ ప్రతినిధులు కలిశారు. చిరంజీవికి వారు ఓ వినతిపత్రం అందించారు.












Click it and Unblock the Notifications