ఫ్లెక్సీ పాలి'ట్రిక్స్': జగన్ ఎమ్మెల్యే కొత్త ట్విస్ట్

YS Jagan - Perni Nani
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీల్లో పెట్టుకొని ఆ పార్టీకి చెందిన కొడాలి నాని, వంగవీటి రాధా తదితరులు కృష్ణా జిల్లాలో వేడిని రాజేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోను కూడా పెట్టుకొని కొత్త పాలిట్రిక్స్ ప్రదర్శించారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను మచిలీపట్నం, విజయవాడలో పెట్టుకోవడం ఇతర జిల్లాలకు కూడా పాకింది. ఖమ్మం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు ఇది పాకింది. అయితే, కేవలం టిడిపిని కాకుండా కాంగ్రెసు పార్టీని కూడా వీరు గందరగోళ పరుస్తున్నారనే చెప్పవచ్చు. తాజాగా పార్టీ విప్ ధిక్కరించి అవిశ్వాస తీర్మానం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పేర్ని నాని ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాకు వస్తున్న సందర్భంగా ఆయన ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు! బొత్సను ఆహ్వానిస్తున్నట్లుగా పేర్ని నాని ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఇది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బొత్స రాక సందర్భంగా పేర్ని నాని ఆహ్వానించిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. అయితే, ఈ ఫ్లెక్సీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్ని నాని చెప్పడం కొసమెరుపు.

కాగా, జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా చిత్రం విడుదల సందర్భంగా ఖమ్మం జిల్లాలోను రెండు రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, జూనియర్ ఎన్టీఆర్‌లో ఫోటోలు దర్శనమిచ్చాయి. విజయవాడలో ప్రారంభమైన ఫ్లెక్సీ రాజకీయం ఇతర జిల్లాలకు పాకడమే కాకుండా జిల్లాలో రోజు రోజుకు ఓ కొత్త మలుపు తిప్పుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+