జగన్ పార్టీలోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు?

Mohan Babu
హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తాను త్వరలో ఓ రాజకీయ పార్టీలో చేరుతానని ప్రకటించడంతో ఈ ప్రచారం ఊపందకుంది. తాను రాజకీయాల్లో చేరినప్పటికీ ఎలాంటి పదవులు తీసుకోనని, సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని మీడియాకు చెప్పారు. దీనితో మోహన్‌బాబు ఏ పార్టీలో చేరతారన్న అంశంపై ఆసక్తి మొదలయింది.

ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న మోహన్‌బాబు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశంలో లక్ష్మీపార్వతి తీరును వ్యతిరేకిస్తూ మోహన్‌బాబు చంద్రబాబునాయుడికి అండగా నిలిచారు. ఎన్టీఆర్‌కు వ్యతిరేక శిబిరంలో నిలబడి, ఎమ్మెల్యేల సమావేశానికి రజనీకాంత్‌తో సహా హాజరై, చంద్రబాబుకు అండగా నిలిచారు. ఆ తర్వాత ఏమైందో గానీ చంద్రబాబుకు దూరమయ్యారు.

చాలాకాలం తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడి కూతురును మోహన్‌బాబు తనయుడు విష్ణుకు ఇచ్చి పెళ్లి చేయడంతో మోహన్‌బాబు రాజకీయంగా మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఫలితంగా వైయస్ కుటుంబంతో బంధుత్వం తోడైంది. చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను మోహన్‌బాబు కలిశారు. షిర్డిసాయిబాబా, రాఘవేంద్రస్వామి దయ వల్ల నిర్దోషిగా జగన్ బయటకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్దికాలానికే తిరుపతిలోని తన స్కూల్ వార్షికోత్సవానికి చంద్రబాబునాయుడును పిలిపించడం చర్చనీయాంశమయింది.

ఒక దశలో మోహన్‌బాబు కుమార్తె లక్ష్మి చంద్రగిరి నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. దీనితో అసలు మోహన్‌బాబు ఎటు వైపు అనే గందరగోళం కనిపించింది. మళ్లీ ఇప్పుడు మోహన్‌బాబు తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడటంతో ఆయన ఏ పార్టీలో చేరనున్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాసరి నారాయణ రావు కూడా జగన్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలున్నాయి. దాంతో తనకు గురువైన దాసరి బాటనే మోహన్ బాబు పట్టవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+