కిరణ్‌కు షాక్: జగన్ పార్టీలోకి మోపిదేవి, భార్య?

Mopidevi Venkataramana - Kiran Kumar Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో వాన్‌పిక్‌కు సంబంధించిన వ్యవహారంలో జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జగన్ వైపు వెళ్లనున్నారనే ప్రచారం సాగుతోంది. ఆస్తుల కేసుకు సంబంధించి జగన్ జైలులో ఉన్నారు. ఆయనకంటే ముందే మోపిదేవి వాన్‌పిక్ వ్యవహారంలో అరెస్టయ్యారు. అయితే, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు అరెస్టుపై పలుమార్లు ఊహాగానాలు చెలరేగాయి.

అయితే, ధర్మాన ప్రసాద రావుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలుస్తున్నారని, తనకు మాత్రం మద్దతివ్వలేదనే ఆవేదన, ఆక్రోశం మోపిదేవిలో ఉందంటున్నారు. ధర్మానకు మద్దతిచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి మండలి తనకు ఇవ్వకపోవడంతో ఆయన పూర్తిగా అసంతృప్తికి లోనయ్యారట.

దీంతో కాంగ్రెసు పార్టీని విడిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జగన్ పార్టీలోకి వెళ్లాలనే నిశ్చితాభిప్రాయంతో ఆయన ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా మోపిదేవి భార్య రంగంలోకి దిగనున్నట్లుగా చెబుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె పాదయాత్ర ఈ నెల 23న రేపల్లెకు వచ్చే అవకాశముంది. మోపిదేవి వెంకటరమణ సతీమణి అరుణ భాస్కరి ఆమె సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మోపిదేవి రేపల్లె నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+