జియా ఖాన్‌తో రెండు రాత్రులు సూరజ్ పంచోలీ

సంభాషణల వివరాల కోసం పోలీసులు జియా ఖాన్ ఫోన్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. సూరజ్ ఫోన్‌లో రెండు మెసేజ్‌లు తొలగించి ఉన్నాయి. సూరజ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఏమీ లేవని పోలీసులు మొదట చెప్పారు. జియా ఖాన్ రాసిన లేఖ దొరికిన తర్వాత సూరజ్‌పై కేసు నమోదు చేయడానికి ముందు పోలీసులు న్యాయనిపుణులను సంప్రదించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి సూరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సూరజ్‌తో పాటు తల్లి, సోదరి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో వెళ్లిపోయారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జియా ఖాన్ చివరిసారిగా సూరజ్‌తోనే ఫోన్‌లో మాట్లాడింది. జియా ఖాన్ తాను రాసిన లేఖలో ఎవరినీ సంబోధించలేదు. కానీ అది సూరజ్ పంచోలీని ఉద్దేశించి రాసిందేనని ఆమె తల్లి రబియా అంటోంది. పోలీసులు సోమవారంనాడు జియా ఖాన్ తల్లి రబియా వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
సినిమా అవకాశాలు రాకపోవడం వల్ల జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుందనే వాదనలో నిజం లేదని, సూరజ్ పంచోలీతో సంబంధం బెడిసికొట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకుందని రబియా సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. నెలలో మూడు, నాలుగు ఈవెంట్లకు జియా హాజరవుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications