ఆంధ్ర భగత్‌సింగ్ హిట్: సమైక్య సింహం (ఫొటోలు)

హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెసు బహిష్కృత పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హిట్టయినట్లే కనిపిస్తున్నారు. లోకసభలో పెప్పర్ స్ప్రే కొట్టిన లగడపాటికి అన్ని పార్టీల సీమాంధ్ర నాయకుల నుంచి మద్దతు లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు మద్దతు ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంచి పని అంటూ లగడపాటికి కితాబు ఇచ్చారు.

తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి లగడపాటి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఆయనను ఆంధ్ర భగత్‌సింగ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇందుకు సంబంధించి సీమాంధ్రలో పోస్టర్లు కూడా పెద్ద యెత్తున వెలిశాయి. సమైక్యాంద్ర హీరోగా ఆయన గుర్తింపు పొందుతున్నారు.

మరోవైపు, తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా హీరో అయినట్లే కనిపిస్తున్నారు. ఆయన పోస్టర్లు కూడా సీమాంధ్రలో వెలిశాయి. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో లోకసభలో ఆయన చాకు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, దాన్ని ఆయన ఖండిస్తున్నారు. మోదుగలపై తెలంగాణ పార్లమెంటు సభ్యులు దాడి చేశారని సీమాంధ్ర నాయకులు ఆరోపిస్తున్నారు.

భగత్ సింగ్‌తో సమానంగా..

భగత్ సింగ్‌తో సమానంగా..

బ్రిటిష్ పాలనలో పార్లమెంటులో బాంబు వేసిన భగత్ సింగ్‌తో లగడపాటి రాజగోపాల్‌ను పోలుస్తూ సీమాంధ్రలో ఫ్లెక్సీలు వెలిశాయి. లగడపాటిని ఆంధ్ర భగత్‌సింగ్‌గా అభివర్ణిస్తున్నారు.

మోదుగుల హీరో..

మోదుగుల హీరో..

లోకసభలో జరిగిన ఘటనలో సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా హీరో అయ్యారు. అయన ఫ్లెక్సీలు కూడా సీమాంధ్రలో పెలిశాయి.

మోదుగుల సమైక్యాంధ్ర సింహం

మోదుగుల సమైక్యాంధ్ర సింహం

సమైక్యాంధ్ర కోసం పోరాడిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని అభినందిస్తూ సీమాంధ్రలో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

టీవీ చానెళ్లలో ప్రకటన..

టీవీ చానెళ్లలో ప్రకటన..

లగడపాటి రాజగోపాల్‌ను ఆంధ్ర భగత్‌సింగ్‌గా అభివర్ణిస్తూ తెలుగు టీవీ చానెళ్లలో వాణిజ్య ప్రకటనల జోరు పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+