దీపికా పడుకోనేకు పడిపోయిన సైనా
హైదరాబాద్: భారత అగ్రశేణి షట్లర్ సైనా నెహ్వాల్ గత నెలలో సయ్యద్ మోడీ అంతర్జాతీయ భారత గ్రాండ్ ప్రిక్స్‌ను గెలుచుకుని ఊపు మీద ఉంది. ప్రస్తుతం మార్చిలో జరిగే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన సైనా నెహ్వాల్ వివిధ విషయాలపైనే కాకుండా సినిమాలపై కూడా హిందూస్థాన్ టైమ్స్‌తో మాట్లాడింది.
పాత స్నేహితురాలు దీపిక పడుకొనే చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాకు ఆమె పడిపోయిందట. 2013లో విజయాలు సాధించిన దీపికకు ఆమె శుభాకాంక్షలు కూడా తెలిపింది. మంచి పని ఫలితాలు ఇస్తుందని నిరూపించినట్లు ఆమె తెలిపింది. తాను చెన్నై ఎక్స్‌ప్రెస్ చూశానని, ఆ సినిమా అద్బుతమని ఆమె వ్యాఖ్యానించింది.

తాను భాగ్ మిల్కా భాగ్ చూశానని, మంచి సినిమా అని చెప్పింది. ధూమ్ 3 సినిమా కూడా చూసిందంట. మంచి చిత్రమని, మంచి నటన ఉందని, పాటలు అద్భుతమని చెప్పింది. మీ జీవితంపై సినిమా తీస్తున్నట్లు పుకార్లు ఉన్నాయని ప్రస్తావిస్తే ఎవరైనా సీరియస్‌గా తీసుకుంటారేమో చూద్దామని నవ్వేసిందట.
సినిమాల్లో మీకు అవకాశాలు వచ్చినట్లు వింటున్నామని అంటే తన ప్రతిభను బ్యాడ్మింటన్‌లో ప్రదర్శనీయండంటూ మరోసారి నవ్వేసింది. పివి సింధు నుంచి మీకు పోటీ ఉన్నట్లుందని అంటే ఒకరి కన్నా ఇద్దరు బెట్టర్ అని వ్యాఖ్యానించింది. దానివల్ల మంచి పోటీ ఉంటుందని చెప్పింది. పోటీ వల్ల భారత్‌కు మంచి జరుగుతుందని చెప్పింది. తామిద్దరం ఎల్లవేళలా మిత్రులమని చెప్పింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications